దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రికార్డు స్ధాయిలో రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతుండగా మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇక కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న రాష్ట్రాలు కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో తిరిగి లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతుండగా దీంతో కూలి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు.
మళ్లీ పూర్తి లాక్డౌన్ విధిస్తారన్న భయాలతో సొంతూళ్లకు వెళ్లిపోవడమే మంచిదని భావిస్తున్న వలస కూలీలు తిరిగి సొంత రాష్ట్రాలకు బయల్దేరుతున్నారు.పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ చాలా మంది నగరాలు, పట్టణాలకు వచ్చి పని చేసుకోవడం మొదలు పెట్టారు.
గతేడాది కరోనాను అరికట్టేందుకు తీసుకున్న కఠిన నిర్ణయాల్లో లాక్డౌన్ ఒకటి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా లాక్డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి సొంతూళ్లకు చేరుకోగా చాలామంది అనారోగ్యం బారీన పడగా కొంతమంది మరణించారు.