ఈ మిడిల్‌ క్లాసోడు మామూలోడు కాదు..!

189
Middle class man is now 50 crores worth
- Advertisement -

నేచురల్‌ స్టార్‌ నాని వరుస సక్సెస్‌ లతో దూసుకుపోతున్నాడు. కారణం నాని ఎంచుకునే కథలే. ఇలా డిఫెరెంట్‌ స్టోరీలను ఎంచుకునే తీరు మిగతా హీరోలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే, ఒక్కో సినిమా నానీని ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తోంది.

చేసిన ప్రతి సినిమా నాని క్రేజ్ ను .. మార్కెట్ ను అమాంతంగా పెంచేస్తోంది. రీసెంట్ గా రిలీజైన ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’ ఇదే విషయాన్ని మరోసారి నిరూపించింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని చేసిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Middle class man is now 50 crores worth

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్ము రేపేస్తోంది. ఈ ఎనిమిది రోజుల్లో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 18 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. మరో 5 కోట్ల వరకూ ఈజీగా లాగేస్తుందని అంటున్నారు.

ఇక మొత్తంగా ఈ ఎనిమిది రోజుల్లో ఈ సినిమా 51.20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందనేది ట్రేడ్ వర్గాల మాట. కథా కథనాలతో పాటు నాని .. సాయిపల్లవి .. భూమిక ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారనీ, అందువల్లనే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి రోజున మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా .. ఆ తరువాత అది హిట్ టాక్ గా మారిపోయింది. మొత్తానికి (ఎంసీఏ) ఈ మిడిల్‌ క్లాసోడు మామూలోడు కాదనే చెప్పాలి.

- Advertisement -