మిస్‌ యూనివర్స్‌గా ఆండ్రియా మెజా..

192
Andrea Meza
- Advertisement -

మెక్సికో అందం ఆండ్రియా మెజా (26) మిస్‌ యూనివర్స్‌-2021 కిరీటాన్ని దక్కించుకుంది. ఫ్లోరిడాలో జరిగిన 69వ మిస్ యూనివర్స్ పోటీల ఫైనల్లో గెలుపొంది విశ్వ సుందరి కిరీటం సొంతం చేసుకుంది. 73 మందిని దాటుకుని మెజా టైటిల్ గెలుచుకుంది. మిస్ యూనివర్స్ కిరీటాన్ని చేజిక్కించుకున్న మూడో మెక్సికన్‌గా నిలిచింది.

ఆండ్రియా మేజా సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. మహిళా హక్కుల కోసం పోరాడుతోంది. మహిళా హక్కుల కోసం ఏర్పాటు చేసిన మున్సిపల్ ఇనిస్టిట్యూట్ ఫర్ విమెన్ తరఫునా పనిచేస్తోంది. అంతేకాదు.. సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్ట్ , మోడల్ కూడా. క్రీడలంటే అమితమైన ఇష్టం. చువావా నగర పర్యాటక రంగ బ్రాండ్ అంబాసిడర్.

ఇక భారత్ తరఫున బరిలో నిలిచిన ఏడ్లిన్ కేస్టలీనో నాలుగో స్థానంలో నిలిచింది. విశ్వ సుందరి రన్నరప్ గా మిస్ బ్రెజిల్ జూలియా గామా, రెండో రన్నరప్ గా మిస్ పెరూ జానిక్ మాచెటా డెల్ కాస్టిలో నిలిచారు. మొత్తంగా మిస్ యూనివర్స్ పోటీల్లో 73 మంది సుందరాంగులు తమ అందచందాలతో పోటీ పడ్డారు. వాస్తవానికి గత ఏడాదే జరగాల్సిన మిస్ యూనివర్స్ పోటీలు కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి.

- Advertisement -