దూసుకొస్తున్న మెట్రో….

345
- Advertisement -

ప్రేమిస్తే, జ‌ర్నీ, పిజ్జా లాంటి వైవిద్య‌మైన, ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన సినిమాల‌ను అందించిన నిర్మాత సురేష్ కొండేటి. ప్ర‌స్తుతం ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్‌4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ర‌జ‌నీ తాళ్ళూరి నిర్మిస్తున్న చిత్రం మెట్రో.

ఈ చిత్ర తొలి కాపీ ఇటీవ‌లే రెడీ అయింది. ఈ నెల 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోందీ చిత్రం. ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌జ‌నీ తాళ్లూరి మాట్లాడుతూ. నిజ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉండే సంఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తీసిన మంచి చిత్ర‌మిది. చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడికి మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించే చిత్ర‌మిది. డిసెంబ‌ర్ 30న సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఇటీవ‌ల రిలీజైన మెట్రో టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా కూడా గొప్ప స‌క్సెస్ అవుతుంది “ అన్నారు.

Metro Telugu Movie

స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -“చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత‌మైన భావోద్వేగాల‌తో సాగే చిత్ర‌మిది. గౌత‌మ్ మీన‌న్ అంత‌టి స్టార్ డైరెక్ట‌ర్ మెచ్చిన చిత్రం కూడా. నేను నిర్మించిన `జ‌ర్నీ` సినిమాని మించి `మెట్రో` విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. గీతామాధురి న‌టించిన పాట‌కు ప్రేక్ష‌కాభిమానుల్లో అద్భుత స్పంద‌న వ‌చ్చింది.“ అన్నారు.

- Advertisement -