విద్యార్థుల్లో అవగాహన కలిగించేందుకు నిజాం కాలేజీ మైదానంలో నిర్వహిస్తోన్న తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటి సీఎం కడియం శ్రీహరి జ్యోతి ప్రజ్వళన చేసి ఫెయిర్‌ను ప్రారంభించారు. కడియం శ్రీహరి కలియతిరుగుతూ స్టాళ్లను పరిశీలించారు. ఫెయిర్‌కు సంబంధించిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్, టీన్యూస్ సీఈవో నారాయణ రెడ్డి, టీన్యూస్ సీజీఎం ఎన్ ఉపేందర్, ఎంపీ మల్లారెడ్డి, మండలి ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరియు తదితరులు పాల్గోన్నారు.
ఈ సంధర్బంగా ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో టీన్యూస్ ఎలా పనిచేసిందో… తెలంగాణ వచ్చిన తరువాత కూడా విధ్యార్థులను సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తోందన్నారు. కోర్సు ఏది తీసుకున్నా.. సబ్జెక్ట్ మంచిగా ఉంటే ఉద్యోగం లభింస్తుదన్నారు. తల్లితండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదన్నారు.
ఏ కోర్సుకు డిమాండ్ ఉందో దానిపైనే ఫోకస్ చేయాలన్నారు ఎంపీ మల్లారెడ్డి.. ఇంజనీరింగ్‌లో చేరగానే స్కిల్స్ పెంచుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. నాలుగేళ్లు సబ్జెక్ట్‌లో లీనమై చదవాలన్నారు. అప్పుడే ఎక్కడైన బ్రతకగలుగుతామని మల్లారెడ్డి అన్నారు.
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. టీన్యూస్ యాజమాన్యానికి కృతజ్ఙతలు తెలియజేస్తున్నాన్నారు. కాలేజీని, కోర్సుని ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ఎన్నో కాలేజీలున్నాయన్నారు. ఇందులో మంచి కాలేజీలు ఎంపిక చేసుకొని.. ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటే ఎన్నో అవకాశాలున్నాయన్నారు. నాణ్యమైన ఇంజనీరింగ్ నిపుణులను తయారుచేసే క్రమంలో.. ఎలాంటి సదుపాయాలు లేని ఇంజనీరింగ్ కాలేజీలకు ఆక్రిడేషన్లు ఇవ్వలేదన్నారు. ఒకప్పడు 50 వేల సీట్లున్నాయి. ఇప్పుడు లక్షా 20 వేల సీట్లు మాత్రమే ఉన్నాయన్నారు. నాణ్యమైన విద్య అందించడం కోసం సీట్లను కుదించడం జరిగిందన్నారు. తెలంగాణలో ఇంజనీరింగ్ విధ్యార్థి ఎక్కడైనా చెల్లుబాటయ్యేలా ఉండాలి. తెలంగాణ విధ్యార్థికి ఎక్కడైన ఉద్యోగం దొరకాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు కడియం.
గత మూడు సంవత్సరాలుగా టీ న్యూస్ నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో వేల సంఖ్యలో విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. వివిధ కాలేజీల సమాచారాన్ని తెలుసుకున్నారు. గత సంవత్సరం హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్‌లో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు సైతం మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా పట్టణ ప్రాంత విద్యార్ధులతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందించేందుకు బాగా ఉపయోగపడింది.ఈ ఫెయిర్‌లో వందకు పైగా కళాశాలలు పాల్గొన్నాయి. ఎడ్యుకేషన్ ఫెయిర్ ఈ నెల 28 వరకు కొనసాగనుంది. నిర్వాహకులు ఎడ్యుకేషన్ ఫెయిర్ ద్వారా ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందించనున్నారు.
ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ప్లాటినమ్ స్పాన్సర్ మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, డైమండ్ స్పాన్సర్ శ్రీ ఇందు గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్,గోల్డ్ స్పాన్సర్ శ్రేయాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ,పవర్డ్ బై విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్,సిల్వర్ స్పాన్సర్ బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్,కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్,నిషిత కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ,గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్,కో స్పాన్సర్స్- శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ,జేబీ ఎడ్యుకేషనల్ సొసైటీ,నారాయణ ఐఏఎస్ అకాడమీ,గిఫ్ట్ స్పాన్సర్స్ – భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ. ఈ కార్యక్రమానికి వెబ్ మీడియా పార్ట్‌నర్ గ్రేట్ తెలంగాణ.కామ్,ప్రింట్ మీడియా పార్ట్ నర్ నమస్తే తెలంగాణ, నాలెడ్జ్ పార్ట్ నర్ వెలాసిటీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్.