షర్మిల పార్టీ విలీనం.. జగన్ స్కెచ్ యేనా ?

31
- Advertisement -

గత కొన్నాళ్లుగా వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుందని, లేదా కాంగ్రెస్ కు మద్దతు తెలుపబోతుందని ఇలా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అటు షర్మిల కూడా కాంగ్రెస్ నేతలతో తరచూ భేటీ అవుతుండడంతో ఈ విధమైన వార్తలు మరింత ఊపందుకున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో షర్మిల రాణించడం కష్టమనే భావనతోనే ఆమె కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆమె కాంగ్రెస్ వైపు చూడడానికి కారణం తన అన్న జగనే అని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

జగన్ సూచనలతోనే ఆమె కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారట. ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా బీజేపీ కేంద్రంలో అధికారం లోకి వచ్చే అవకాశం ఉంది. జగన్ ఇప్పటికే అడపా దడపా బీజేపీకి అనుకూలంగా ఉంటూ వచ్చారు. అటు షర్మిల కాంగ్రెస్ కు మద్దతు పలికితే.. ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తమకు అనుకూలమే అనేది జగన్ ఆలోచనగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే జగన్ షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయనే మాట మొదటి నుంచి వినిపిస్తూనే ఉంది.

Also Read: CMKCR:జై తెలంగాణ.. జైజై తెలంగాణ

అయితే ఎన్ని విభేదాలు ఉన్న వారిద్దరు అన్నచెల్లెళ్ళు కావడంతో రాజకీయంగా సలహాలు సూచనలు జగన్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే జగన్ సూచనల మేరకే షర్మిల కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు సిద్దమౌతున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో ఇన్ సైడ్ టాక్. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఇడుపులపాయ రానున్నట్లు తెలుస్తోంది. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందా అనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ హాట్ టాపిక్ గా మారిన వైఎస్ షర్మిల వ్యవహారం.. ఎలాంటి సంచలనలు దారి తీస్తుందో చూడాలి.

Also Read: KCR:డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభం

- Advertisement -