మరో మూడు బ్యాంకుల విలీనం..

281
bob
- Advertisement -

నూతన సంవత్సర వేళ మరోసారి బ్యాంకుల విలీనం అంశం తెరమీదకు వచ్చింది.దేనా బ్యాంకు,విజయా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాల విలీనాన్ని కేంద్రం అమోదించింది. బ్యాంకు విలీనం వల్ల ఉద్యోగుల సర్వీసుపై ఎటువంటి ప్రభావం చూపదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ మూడు బ్యాంకుల విలీనంతో వినియోగదారులకు సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు.ఈ బ్యాంకుల విలీనం వల్ల ఏర్పడే కొత్త బ్యాంకు ఎస్బీఐ, ఐసీఐసీఐ తర్వాత దేశంలోనే 3వ అతి పెద్ద బ్యాంకుగా అవతరిస్తుందని చెప్పారు.

అయితే ఈ మూడు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు యూనియన్లు ఒక రోజు సమ్మె చేసిన కేంద్రం పట్టించుకోలేదు.విలీన ప్రక్రియ 2019 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ,కొత్తగా ఏర్పడే బ్యాంకులో 85 వేలకు పైగా ఉద్యోగులు ఉంటారని, దేశ, విదేశాల్లో 9,485 బ్రాంచ్ లు ఏర్పడతాయని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు అనుబంధ బ్యాంకులను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్‌ (ఎస్‌బీబీజే), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ (ఎస్‌బీఎం), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావన్‌కోర్‌(ఎస్‌బీటీ) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా(ఎస్‌బీపీ), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) విలీనమైన సంగతి తెలిసిందే.

- Advertisement -