పెళ్లిచూపులు తరువాత నిర్మాత రాజకందుకూరి ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం `మెంటల్ మదిలో` ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. డి.సురేశ్‌బాబు సమర్పించారు. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 24న విడుదలైన ఈ చిత్రం నేటికీ మంచి స్పందనతో పాటు కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. ఈ సందర్బంగా మెంటల్ మదిలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ సెలెబ్రేషన్స్ ను కొనసాగిస్తూ గురువారం రామానాయుడు స్టూడియోలో ఎనాలసిస్ మీట్ ను ఏర్పాటు చేశారు ఈ చిత్ర యూనిట్.
ఈ సందర్బంగా ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా కి ఇది మంచి టైటిల్ అని మేము అనుకున్నాం… కానీ ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడానికి కరెక్ట్ టైటిలే కాదని కొందరు అంటున్నారు.. ఏది ఏమైనా ప్రేక్షకులే కదా సినిమాను ఆదరించేది… అందుకే ఈ చిత్రాన్ని మంచి ఫీల్ గుడ్ మూవీ గా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మొదట గా థాంక్స్ తెలియచేస్తున్నా… అలానే సినిమా యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రస్తుత సినీ స్థితి గతులు చూసుకుంటే… సినీ ఇండస్ట్రీలో చాలా మంది నిజాలను కార్పెట్ కింద దాచేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఇది చాలా ప్రమాదం. చాలా మంది సక్సెస్ మీట్ లు పెడుతున్నారు అసలయిన సక్సెస్ మీట్ అంటే ఏంటో అని ప్రేక్షకులు కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఇక కొంత మంది శాటిలైట్ టైం ను తగ్గించేస్తున్నారు.
సినిమా విడుదలయ్యి నెల కూడా దాటకుండానే టీవీ లలో వేసేస్తున్నారు వాటి వాళ్ళ ఎంత నష్టం వాటిల్లుతుందో వారికి అర్థం కావడం లేదు… ఇకపై డైరెక్ట్ గా శాటిలైట్ లొనే విడుదల చేస్తారేమో.. అదే పరిస్థితి గనుక వస్తే సినిమా పరిశ్రమ ఏ రకంగా మారుతుందో ఊహించలేము.. వారం వారం 10, 15 సినిమాలు విడుదల చేసి థియేటర్‌లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అంతే కాదు కోటి రూపాయల సినిమాను ప్రమోట్ చేయడానికే కోటి ఖర్చవుతోంది.. అలా కాకుండా థియేటర్స్ లోనే ఫ్రీ ట్రైల్లర్లను వేస్తే చిన్న సినిమాలకు, మంచి సినిమాలకు ఊరట ఇచ్చే వారవుతారు… ఇవేవీ ప్రస్తుతం ఎవరికీ అర్థం కావడం లేదు. అదేవిధంగా డిజిటల్ సినిమా ఇండస్ట్రీ మన దేశంలో అమలు కావడం లేదు… ఈ విషయాలపై నిర్మాతలు కలిసి కట్టుగా ఉంటే సమస్యలను పరిషరించవచ్చు.. సమస్యలు పరిష్కారం కాకపోతే తొందరలో పెద్ద గొడవ అవుతుంది అని చెప్పారు..
అనంతరం చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. మెంటల్ మదిలో చిత్రాన్ని నేటి వరకు ఆదరిస్తున్న ప్రేక్షకుల అందరికీ నా కృతజ్ఞతలు… మంచి కంటెంట్ ఉంటె ఆదరిస్తారని మరోసారి ఈ సినిమా తో ప్రూవ్ అయ్యింది…. ఇవి మెంటల్ మదిలో సెలెబ్రేషన్ లో భాగమే అయినా అనాలసిస్ మీట్. ఈ సినిమా పై అభిప్రాయాన్ని ఎవరైనా తెలియపరచవచ్చు… మా బ్యానర్ లోనే డైరెక్టర్ వివేక్ తో బ్రోచేవారెవరు రా… అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాం… సినిమా సక్సెస్ అయిందని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదు… అని చెప్పారు.
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ సినిమా బాగుంటే తప్పకుండా ఆదరిస్తూనే ఉంటారని ఈ సినిమా చూసిన ప్రేక్షకుల వలన అర్థం అవుతోంది… యూనిట్ మొత్తానికి నా శుభాకంక్షలు.. ప్రేక్షకులకు నా కృతజ్ఞతలని అన్నారు. దర్శకుడు వివేక్ మాట్లాడుతూ కథ చెప్పినప్పుడు ఏ విధంగా అయితే నమ్మి ప్రేక్షకుల ముందుకు తెచ్చామో అదే విధంగా ఫలితం కూడా అంతే విజయాన్ని తెచ్చి పెట్టింది.. ఆదరిస్తున్న ప్రేక్షుకులకు… నాతో మరో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన రాజకందుకూరికి నా ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి కూడా ఈ కార్యక్రమం లో పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేసారు… మెంటల్ మదిలో తర్వాత మళ్ళి సురేష్ బాబు, వివేక్ ఆత్రేయల కలయికలో బ్రోచేవారెవరురా అనే క్రైమ్ థ్రిల్లర్ చేయబోతున్నామని, త్వరలోనే చిత్ర తారాగణం మరియు సాంకేతిక నిపుణులు గురించి వెల్లడిస్తాం అని రాజ్ కందుకూరి తెలిపారు.