మేమ్ ఫేమస్‌..14న అయ్యయ్యో సాంగ్‌

42
- Advertisement -

‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేమ్ ఫేమస్ మ్యూజికల్ జర్నీ ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయనున్నారు. రైటర్ పద్మభూషణ్‌కి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన కళ్యాణ్ నాయక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ మేమ్ ఫేమస్ కోసం 9 పాటలను కంపోజ్ చేశారు.

ఆస్కార్ వేదికపై తెలుగు పతాకాన్ని రెపరెపలాడించిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఒక్కో పాటను పాడారు. ప్రముఖ గాయని మంగ్లీ మరో పాటని ఆలపించారు. మిగిలిన పాటలను ప్రముఖ సింగర్స్ పాడారు. ఫేమస్ సింగర్స్ పాడిన మేమ్ ఫేమస్ ఆల్బమ్ చార్ట్‌బస్టర్‌గా మారబోతోంది. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ అయ్యయ్యో పాటని ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా బ్యూటీఫుల్ అండ్ ప్లజంట్ గా వుంది.

శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సృజన అడుసుమిల్లి ఎడిటర్, అరవింద్ మూలి ఆర్ట్ డైరెక్టర్.

ఇవి కూడా చదవండి…

రుద్రుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ :లారెన్స్‌

హీరోగా కంటే మంచి మనిషిగా హిట్

శ్రద్ధా దాస్..‘పారిజాత పర్వం’

- Advertisement -