నా జీవితంలో ఇది ఒక మైలురాయి- సింగర్ సునీత

23

సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని సింగర్ సునీత అన్నారు. ఈ ప్రయాణంలో బాలు నుంచి ఎన్నో నేర్చుకున్నానని, ఆయన భౌతికంగా లేకపోయినా ఎప్పుడూ ఆయన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్​లోని మాదాపుర్​లో జనవరి 8న ‘మెలోడియస్ మూమెంట్​ విత్ సునీత’ పేరుతో ఓ సంగీత కార్యక్రమం నిర్వహించానున్నారు. ప్రసాద్ ల్యాబ్స్​లో ఈ ఈవెంట్​ పోస్టర్​ను సునీత గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సంగీతం మానసిక ఉల్లాసం అందించడం సహా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని గాయనీ సునీత అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు స్టీఫెన్‌ దేవస్సీతో కలిసి నిర్వహించే ‘మెలోడియస్‌ మూమెంట్‌ విత్‌ సునీత’ కార్యక్రమం తన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. గులాబీలోని ‘ఈ వేళలో నీవు’ పాట నుంచి ఇప్పటివరు వరకు పాడిన పాటలను వినూత్న రీతిలో సంగీత ప్రియులకు వినిపించనున్నట్లు ఆమె వెల్లడించారు.