అదరగొట్టిన అజిత్.. ‘వలిమై’ ట్రైలర్..

24

అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం వాలిమై. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కాబోతుంది. తెలుగులోను బలం పేరుతో అనువాదమవుతోంది. బోనీ కపూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు వినోద్ దర్శకత్వం వహించారు.. ఈ చిత్ర తమిళ ట్రైలర్ తాజాగా విడుదల అయింది. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేపుతోంది.

బైక్ చేజింగ్స్ తోనే ఈ ట్రైలర్ మొదలైంది. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అజిత్ కనిపిస్తున్నాడు. విలన్ గ్యాంగ్ ను పట్టుకోవడానికి ఆయన చేసే ప్రయత్నాల్లో భాగంగానే భారీ యాక్షన్ సీన్స్ చోటుచేసుకుంటున్నాయి. బైక్ లపై .. కార్లపై ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

Valimai Official Trailer | Ajith Kumar | Yuvan Shankar Raja | Vinoth | Boney Kapoor | Zee Studios