రామ్‌ చరణ్‌కు కరోనా పాజిటివ్

53
ramcharan

మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన రామ్ చరణ్..తనకు ఎలాంటి లక్షణాలు లేవని అయినా హోం క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని తెలిపిన చరణ్…త్వరలోనే మీ ముందుకు వస్తానని వెల్లడించారు.

ప్రస్తుతం రామ్ చరణ్…రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్‌తో పాటు కొరటాల శివ – చిరు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆచార్యలో కీ రోల్ పోషిస్తున్నారు. అంతేగాదు ఆచార్య మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు రామ్ చరణ్.