బీచ్‌లో మెహ్రీన్‌…ఏం చేస్తుందో తెలుసా!

157
pirzada
- Advertisement -

మాజీ సీఎం భజన్ లాల్ మనవడు బిష్ణోయ్ తో నిశ్చితార్ధం అనంతరం బ్రేకప్ చెప్పిన నటి మెహ్రీన్‌…ఆ సంగతి మరచిపోయి తెగ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా తన లెటెస్ట్ పిక్స్‌ షేర్ చేస్తూ వచ్చిన మెహ్రీన్ తాజాగా బీచ్‌లో సందడి చేస్తూ కనువిందు చేసింది.

బీచ్ లో కొత్త ఉత్సాహం వచ్చినంత ఆనందంగా ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసి తాను సంతోషంగా ఉన్నాననే సంకేతాన్ని ఇచ్చింది. ప్రస్తుతం మెహ్రీన్‌ బీచ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఎఫ్3 సినిమాలో నటిస్తోన్న మెహ్రీన్‌…ఈ సినిమాతో పాటు మారుతి-సంతోష్ శోభన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ లీడ్‌ రోల్ పోషిస్తోంది.

- Advertisement -