ఉద్యోగాల భర్తీ…వేగవంతం

201
cm kcr
- Advertisement -

50 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. 13న జరిగే కేబినెట్ లో ఉద్యోగాల ఖాళీ, భర్తీ పై చర్చ జరగడంతో కేబినెట్ అమోదం తెలపనున్న నేపథ్యంలో అన్నిశాఖల అధికారులతో సమావేశం అయిన సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

సీఎం ఆదేశాలతో శాఖల వారిగా ఖాళీల ఫైనల్ జాబితా తీసుకున్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్.. ఆయా శాఖలు ఇచ్చిన ఖాళీల వివరాలను క్రోడీకరించి కేబినెట్ ముందు పెట్టనుంది ఆర్థిక శాఖ. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ అనేది కేబినెట్ మీటింగ్ తర్వాత క్లారిటీ రానుంది.

రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్టు రిక్రూట్ మెంట్) అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ముందుగా భర్తీ చేసి అన్నిశాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టిన తర్వాత ఏర్పడే ఖాళీలను సెకండ్ ఫేజ్‌లో భర్తీ చేయనున్నారు.

- Advertisement -