బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెహ్రీన్‌…ఫ్యాన్స్‌ ఫిదా..!

119
mehreen pirzada

మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించి సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న హిందీ భామ మెహ్రీన్ . కృష్ణగాడి వీర ప్రేమ గాథతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్‌,కోలీవుడ్‌,మలయాళ,పంజాబీ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. అయితే వరుస పరాజయాలతో డీలా పడినా ఈ బ్యూటీ ఎఫ్‌ 2 మూవీతో తిరిగి గాడిలో పింది. వెండితెరపై గ్లామరస్‌గా కనిపించడానికి వెనుకాడని మెహ్రీన్.. ఎప్పటికప్పుడు తన లెటేస్ట్ పిక్స్‌ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని కనువిందు చేస్తోంది.

తాజాగా కంప్లీట్ బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయింది మెహ్రీన్. బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెహ్రీన్ అందాలు కనువిందు చేస్తుండగా నెటిజన్లు సైతం ఫిదా అయిపోయారు. ఇక ప్రస్తుతం ఎఫ్‌ 3 మూవీలో నటిస్తున్న మెహ్రీన్‌…ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇటీవలె హరియాణా మాజీ సీఎం భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్ మెంట్ జరుగగా అది క్యాన్సిల్ చేసుకున్న మెహ్రీన్ తిరిగి తన కెరీర్‌పై దృష్టిసారించింది.