రెండో సారి తండ్రి అయిన భజ్జీ..

70
Harbhajan Singh

భారత జట్టు వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రెండోసారి తండ్రయ్యాడు. భజ్జీ భార్య, నటి గీతా బస్రా శనివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. ఆరోగ్యవంతమైన మగ బిడ్డను ప్రసాదించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నామని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని భజ్జి తెలిపాడు. చాలా చాలా ఆనందంగా ఉందన్నాడు. తమ మంచిని కోరుతూ ఎప్పుడూ అండగా నిలిచి ప్రేమను పంచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు.

‘‘మా చేతుల్లోకి మరో చిట్టి చెయ్యి వచ్చింది. అతడి ప్రేమ గొప్పది.. మా బంగారం. మాకు దక్కిన గొప్ప కానుక. అత్యంత ప్రత్యేకమైనది. ఆ ఆనందంతో మా హృదయాలు ఉప్పొంగుతున్నాయి’’ అని భజ్జీ ట్వీట్ చేశాడు. కాగా, హర్భజన్, గీతా బస్రా దంపతులకు ఇప్పటికే హినాయ అనే పాప ఉంది. 2016 జులైలో వారికి తొలిసంతానం కలిగింది.