నేతన్నలకు అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్

112
ktr minister

నేత‌న్న‌కు చేయూత‌, చేనేత మిత్ర ప‌థ‌కాల వ‌ల్ల కార్మికులు లాభం పొందుతున్నారని వెల్లడించారు మంత్రి కేటీఆర్. నేత‌న్న చేయూత కార్య‌క్ర‌మం ద్వారా గ‌తేడాది రూ. 96 కోట్లు విడుద‌ల చేశామ‌ని వెల్లడించిన కేటీఆర్… నారాయ‌ణ‌పేట‌లో చేనేత వృత్తికి సంబంధించి గొప్ప క‌ళాకారులు ఉన్నార‌ని ఎమ్మెల్యే చెప్ప‌డం జ‌రిగింది. వారికి అన్ని విధాలుగా ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు.

నారాయ‌ణ‌పేట‌లో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్‌టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…రాష్ర్టంలోని నేత‌న్న‌ల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం.. అందుకు సంబంధించిన కార్య‌క్ర‌మాల‌ను భ‌విష్య‌త్‌లో అమ‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

నారాయ‌ణ‌పేట చేనేత క‌ళాకారులంద‌రికీ నైపుణ్య శిక్ష‌ణ కేంద్రం ఏర్పాటు చేయాల‌ని ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డి కోరారని…. ఎమ్మెల్యే విజ్ఞ‌ప్తి మేర‌కు రూ. 10 కోట్ల‌తో నైపుణ్య శిక్ష‌ణ కేంద్రానికి శంకుస్థాప‌న చేసుకున్నామ‌ని తెలిపారు. ఈ శిక్ష‌ణ కేంద్రం వ‌ల్ల‌ చేనేత కార్మికుల‌కు అపార‌మైన లాభం జ‌రుగుతుంద‌న్నారు. 50 శాతం స‌బ్సిడీ మీద నూలు, ర‌సాయ‌నాల‌ను రాష్ర్ట ప్ర‌భుత్వం నేత కార్మికుల‌కు అందిస్తున్నామ‌ని తెలిపారు.