మెహర్ రమష్ తో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఎట్టకేలకు షూటింగ్ జరుపుకుంటుంది. పదకొండు ఏళ్ల నిరీక్షణ తర్వాత మెహర్ రమష్ కి చిరంజీవి డేట్లు ఇచ్చాడు. నిజానికి సినిమా చేద్దాం అని చిరంజీవి మాట ఇచ్చిన రెండేళ్లకు సినిమా స్టార్ట్ అయింది. ఓ స్క్రిప్ట్ కోసం ఏడాది సమయం పెట్టేశాడు మెహర్ రమష్. అయినా మెహర్ రమష్ కి మరో ఏడాదికి పైగా గ్యాప్ వచ్చేసింది. నిజానికి చిరంజీవి – మెహర్ రమష్ సినిమా ఇప్పుడు కాదు, ఎప్పుడో పట్టాలు ఎక్కాలి. కంత్రి, బిల్లా తర్వాత మెహర్ రమష్ కి బాగానే క్రేజ్ వచ్చింది. అప్పట్లో మెగాస్టార్ కూడా మెహర్ రమష్ తో వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ.. కుదరలేదు. అంతలో మెహర్ రమష్ అడగకుండానే వెంకటేష్ పిలిచి మరీ డేట్లు ఇచ్చాడు. కట్ చేస్తే.. షాడో లాంటి డిజాస్టర్ సినిమా వచ్చింది. ఈ సినిమా కారణంగా వెంకటేష్ కంటే.. మెహర్ రమషే ఎక్కువ నష్టపోయాడు. ఒక్క ఫ్లాప్ మెహర్ రమష్ చేత వంద బ్యాక్ స్టెప్స్ వేయించేసింది. మెహర్ రమష్ కి అప్పుడు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు వెనక్కి తగ్గారు. డేట్స్ ఇస్తామన్న హీరోలు మొహం చాటేసారు. ఈ క్రమంలోనే మెహర్ రమష్ – మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. అప్పుడు మిస్ అయిన సినిమా.. ఇన్నాళ్లకు స్టార్ట్ అయింది. కానీ కథ మారింది. చిరంజీవి కోసం ‘మెహర్ రమష్ ఓ కథను రాశాడు. కానీ.. చిరంజీవికి నచ్చలేదు. అందుకే, ఆ కథ ప్లేస్ లోకి భోళా శంకర్ పేరుతో వేదాలం రీమేక్ వచ్చింది. ఈ వేదాలం రీమేక్ మెగాస్టార్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఎప్పుడో 2015 లో వచ్చిన పాత సినిమా మాకెందుకు? వేదాలం రీమేక్ వద్దంటే వద్దు బాబోయ్ అంటూ మెగా ఫ్యాన్స్ నెట్టింట గోల చేస్తున్నారు. మెహర్ రమష్ ను ట్రోల్ చేస్తున్నారు. అయినా మేకర్స్ మాత్రం ముందుకే వెళ్తున్నారు. మరీ ఫ్యాన్స్ కి నచ్చని సినిమా చేసి ఇంకెవర్ని మెప్పిద్దాం అని?. కనీసం స్క్రిప్ట్ లో అయినా ట్రెండ్ కి తగ్గట్టు సీన్స్ ను మార్చుకోవాలని ఆశిద్దాం.
ఇవి కూడా చదవండి…