‘మెహబూబా’ వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుంది- దిల్‌ రాజు

302
- Advertisement -

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ నిర్మించిన చిత్రం ‘మెహబూబా’. 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్స్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇండస్ట్రీలోను, అటు ఆడియన్స్‌లోను ‘మెహబూబా’ చిత్రంపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొని వున్నాయి. అందరి అంచనాలకు రీచ్‌ అయ్యేవిధంగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన దైన స్టైల్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా చూసిన దిల్‌ రాజు ‘ఎక్స్‌ట్రార్డినరీగా వుంది… ఇది పూరి సినిమా అంటే’ అని యూనిట్‌ని అప్రిషియేట్‌ చేయడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. పూరి సంగీత్‌ ద్వారా ఈ చిత్రంలోని పాటలు రిలీజ్‌ కానున్నాయి. శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ అధినేత దిల్‌ రాజు మే 11న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఏప్రిల్‌ 15న హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో ప్రెస్‌మీట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు, పూరి కనెక్ట్స్‌లో ఒకరైన ఛార్మి కౌర్‌, హీరో ఆకాష్‌, హీరోయిన్‌ నేహాశెట్టి, కెమెరామెన్‌ విష్ణుశర్మ, ఆర్ట్‌ డైరెక్టర్‌ జానీ షేక్‌, ఎడిటర్‌ జునైద్‌ సిద్ధిఖీ, ఫైట్‌ మాస్టర్‌ రియల్‌ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

 Mehbooba is one of Puri's best films

హిట్‌ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, దిల్‌ రాజు మాట్లాడుతూ – ”2002లో ‘ఇడియట్‌’తో పూరి జగన్నాథ్‌గారితో అసోసియేట్‌ అయ్యాను. అప్పుడు నేను నథింగ్‌. పవన్‌కళ్యాణ్‌గారితో ‘బద్రి’, మహేష్‌బాబుతో ‘పోకిరి’, ప్రభాస్‌తో ‘బుజ్జిగాడు’, ఎన్టీఆర్‌గారితో ‘టెంపర్‌’, రామ్‌చరణ్‌తో ‘చిరుత’, బన్నితో ‘దేశముదురు’, రవితేజతో ‘ఇడియట్‌’ సినిమాలు తీసి సూపర్‌హిట్స్‌ కొట్టాడు జగన్‌. తన హీరోలకి సెపరేట్‌ క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేసి సినిమాలు చేస్తారు. టాప్‌ స్టార్స్‌ అందరితో సినిమాలు చేసి సక్సెస్‌లు కొట్టారు. అప్‌ అండ్‌ డౌన్స్‌ అనేది ఎవరికైనా కామన్‌.

ఎక్స్‌ట్రార్డినరీ డైరెక్టర్‌ ఆయన. అద్భుతమైన కథ రాస్తే సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తారు. ఈ సినిమా టీజర్‌ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా అన్పించింది. మ్యాంగో రామ్‌ కాల్‌ చేసి ఈ సినిమా చూడమని చెప్పారు. పూరి జగన్నాథ్‌, ఛార్మి షో వేశారు. నేను భయం భయంగా వెళ్లి చూశాను. ఎందుకంటే నా జడ్జిమెంట్‌ మీద ఆడియన్స్‌లో మంచి అభిప్రాయం వుంటుంది. ఈ సినిమాలో ఎలా వుంటుందో అనుకుంటూ ‘మెహబూబా’ చిత్రాన్ని చూశాను. ఫస్ట్‌ హాఫ్‌ చూశాక సినిమా చాలా బాగుంది అన్నాను. ప్రీ క్లైమాక్స్‌లో కరెంట్‌ పోయింది. అప్పుడు పూరి ల్యాప్‌టాప్‌లో క్లైమాక్స్‌ చూశాను. అదిరిపోయింది. దిస్‌ ఈజ్‌ యువర్‌ స్ట్రెంగ్త్‌ అని పూరితో చెప్పాను. బయటికి వచ్చాక తెలిసినవారికి, తెలియనివారికి అందరికీ ‘మెహబూబా’ చూశాను. చాలా బాగుంది అని చెప్తున్నాను. జగన్‌ మ్యాజిక్‌ మళ్లీ ‘మెహబూబా’తో రిపీట్‌ అవుతుంది. కంటెంట్‌ వుంటే ఎలాంటి సినిమా అయినా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. 400 ఏళ్ల నాటి కథ తీసుకొని రాజమౌళి ‘మగధీర’ సినిమా తీశాడు. ఆ సినిమా ఆ రోజుల్లో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు జగన్‌ 1971 ఇండియా – పాకిస్థాన్‌ వార్‌ కథాంశంతో 2018కి తగ్గకుండా రెండు స్టోరీలను మిక్స్‌ చేసి అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ‘మెహబూబా’ చిత్రాన్ని ఫెంటాస్టిక్‌గా తీశారు. ఎమోషన్స్‌ని, లవ్‌ని బ్యూటిఫుల్‌గా క్యారీ చేశాడు. పూరి క్లైమాక్స్‌ని హోల్డ్‌ చేసిన విధానం నాకు చాలా కొత్త సినిమా చూసిన ఫీలింగ్‌ కల్గింది. ఆకాష్‌, నేహా సూపర్బ్‌గా పెర్‌ఫార్మ్‌ చేశారు. ఈ సినిమాతో మంచి ఆర్టిస్ట్‌లుగా పేరు తెచ్చుకుంటారు. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరూ చాలా హార్డ్‌వర్క్‌ చేశారు. ఇది టీమ్‌ వర్క్‌. పూరి జగన్నాథ్‌ కెరీర్‌లో ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఫిలిం అవుతుంది. ఈ చిత్రాన్ని మే 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేస్తున్నాం” అన్నారు.

 Mehbooba is one of Puri's best films

హీరో ఆకాష్‌ పూరి మాట్లాడుతూ – ”డాడీ స్టోరి చెప్పారు. నాకు బాగా నచ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా సినిమా చేశాం. టీం అంతా చాలా కష్టపడి వర్క్‌ చేశారు. ఎక్కడా భయం అన్పించలేదు. షూటింగ్‌ అంతా హ్యాపీగా జరిగింది. టీజర్‌కి, ట్రైలర్‌కి మేం ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికన్నా డబుల్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా బాగా వచ్చిందని, మేం అంతా కాన్ఫిడెన్స్‌గా వున్నాం. దిల్‌ రాజుగారు సినిమా చూసి చాలా బాగుంది అని చెప్పాక మా కాన్ఫిడెన్స్‌ టెన్‌ టైమ్స్‌ రెట్టింపు అయ్యింది. ఆయన మా సినిమా రిలీజ్‌ చేస్తున్నారు అనగానే నీ సినిమా సూపర్‌హిట్‌ అని ప్రతి ఒక్కరూ కంగ్రాట్స్‌ చెప్తున్నారు. చాలా చాలా సంతోషంగా వుంది. మా కెమెరామెన్‌ విష్ణుశర్మ తన విజువల్స్‌తో ఈ సినిమాని నెక్స్‌ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లారు. ఈ సినిమా తర్వాత వన్‌ ఆఫ్‌ ది టాప్‌మోస్ట్‌ కెమెరామెన్‌ అవుతాడు. ఫైట్‌ మాస్టర్‌ సతీష్‌ అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ని కంపోజ్‌ చేశారు. ప్రతిది చాలా కేర్‌ తీసుకొని చేయించాడు. జానీ బ్యూటిఫుల్‌ సెట్స్‌ వేశాడు. ఎడిటర్‌ జునైద్‌గారు సినిమా చాలా అందంగా ఎడిట్‌ చేశారు. విషురెడ్డి బాగా చెయ్యాలని నన్ను ఎంతో మోటివేట్‌ చేశాడు. ఈ సినిమాలో విలన్‌గా సూపర్బ్‌గా నటించాడు. నన్ను నమ్మి ఇంత రెస్పాన్స్‌బులిటీతో సినిమా చేసే అవకాశం ఇచ్చారు మా నాన్న. అందరూ మీ నాన్న నిన్ను లాంచ్‌ చేస్తున్నారు. వెరీ లక్కీ అంటున్నారు. కానీ ‘మెహబూబా’లాంటి గొప్ప సినిమాతో మా నాన్నని నేను లాంచ్‌ చేస్తున్నానని గర్వంగా చెప్పగలను. సినిమా చూశాం. మా అందరికీ నచ్చింది. ఆడియన్స్‌ కూడా చూస్తే ఇంకా పగిలిపోతుంది” అన్నారు.

ఛార్మి కౌర్‌ మాట్లాడుతూ – ”పూరి చాలా క్లారిటీగా స్క్రిప్ట్‌ రాస్తారు. విజువల్స్‌, డైలాగ్స్‌ ప్రతిది సినిమా చూసినట్టు నేరేట్‌ చేస్తారు. ఈ సినిమాకి ది బెస్ట్‌ టెక్నీషియన్స్‌ అంతా వర్క్‌ చేశారు. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌, ఎగ్జిక్యూషన్‌ డిపార్ట్‌మెంట్‌, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పూరిగారి మీదన్న ప్రేమతో వర్క్‌ చేశారు. వారందరికీ పేరు పేరునా నా థాంక్స్‌. ఆకాష్‌, నేహా, విషురెడ్డి ఫెంటాస్టిక్‌గా యాక్ట్‌ చేశారు. స్పెషల్‌గా ఆకాష్‌ యాక్షన్‌ సీన్స్‌, వార్‌, ఛేజ్‌ సీన్‌లలో చాలా డేర్‌గా రియల్‌గా నటించాడు. వార్‌ సీన్స్‌లో 800 సోల్జర్స్‌తో ఎక్స్‌లెంట్‌గా పెర్‌ఫార్మ్‌ చేశాడు. హ్యాట్సాఫ్‌ ఆకాష్‌. దిల్‌ రాజుగారు సినిమా చూసి పూరిగారికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి, హగ్‌ చేసుకొని ‘ఇది పూరిగారి సినిమా అంటే… ఇది పూరిగారి సినిమా అంటే’ అన్నారు. ఆయన జడ్జిమెంట్‌ కరెక్ట్‌గా వుంటుంది. సినిమా పై మాకున్న కాన్ఫిడెన్స్‌ మరింత పెరిగింది. స్మాల్‌ కాంటెస్ట్‌ని నిర్వహించి పూరి కనెక్ట్స్‌ ద్వారా బెస్ట్‌ టాలెంట్‌ని తీసుకున్నాం. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ దగ్గర్నుండీ, టీజర్‌, ట్రైలర్‌ వరకు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో 4 మిలియన్‌ వ్యూస్‌తో ట్రెండింగ్‌ అవుతోంది. మమ్మల్ని సపోర్ట్‌ చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్‌. ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘ఓ ప్రియా.. నా ప్రియా’ సాంగ్‌ని ఏప్రిల్‌ 16 సాయంత్రం 5 గంటలకు రిలీజ్‌ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని మే 11న దిల్‌రాజుగారు రిలీజ్‌ చేస్తున్నారు. ఆయనకి స్పెషల్‌ థాంక్స్‌” అన్నారు.

కెమెరామెన్‌ విష్ణుశర్మ మాట్లాడుతూ – ”పూరి జగన్నాథ్‌గారితో పని చేయడం చాలా హ్యాపీగా వుంది. కథ విని స్పెల్‌ బౌండ్‌ అయ్యాను. ప్రతి ఒక్కరూ ఫెంటాస్టిక్‌గా వర్క్‌ చేశారు. సినిమా షూటింగ్‌లో చికెన్‌ ఫాక్స్‌ వచ్చినప్పుడు ఎక్కడా బ్రేక్‌ తీసుకోకుండా ఇష్టంతో వర్క్‌ చేశాను. ఆ సమయంలో ఛార్మిగారు చాలా సపోర్ట్‌ చేశారు. ఇంత మంచి లవ్‌స్టోరికి వర్క్‌ చేసినందుకు చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను” అన్నారు.

కళా దర్శకుడు జానీ మాట్లాడుతూ – ”ప్రతి ఒక్కరి హృదయాలకు నచ్చేవిధంగా ఈ సినిమా వుంటుంది. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరూ మనసు పెట్టి ఇష్టంతో పని చేశాను. ప్రతి టెక్నీషియన్‌ తమని తాము ప్రూవ్‌ చేసుకోవాలని పోటాపోటీగా వర్క్‌ చేశారు. ఆకాష్‌ బాగా చెయ్యాలి అని తపన పడుతూ ఎంతో కష్టపడి ఈ సినిమాలో నటించాడు. క్యారెక్టర్‌లో లీనమై అద్భుతంగా నటించాడు. సెట్లో అందరూ అతని యాక్టింగ్‌ చూసి క్లాప్స్‌ కొట్టేవాళ్లు. ఈ సినిమా ఆకాష్‌కు గొప్ప పేరు తెస్తుంది” అన్నారు.
ఎడిటర్‌ జునైద్‌ సిద్ధిఖీ మాట్లాడుతూ – ”ఇట్స్‌ ఎ వెరీ ఎమోషనల్‌ ఫిల్మ్‌. ఇంత మంచి సినిమా ఈమధ్యకాలంలో రాలేదు. వండ్రఫుల్‌ కంటెంట్‌తో పూరిగారు ఈ సినిమాని తీశారు. ఎడిటింగ్‌ రూమ్‌లో ఈ సినిమా చూసినప్పుడు నాకు, పూరిగారికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అంత అద్భుతంగా వుంది. డిఫరెంట్‌ ప్యాట్రన్‌ ఫిల్మ్‌. ఆకాష్‌ ఒక్క కట్‌కి కూడా పనిలేకుండా స్టన్నింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. నేహాశెట్ట అమేజింగ్‌గా నటించింది. ప్రతి ఒక్క టెక్నీషియన్‌ మనసు పెట్టి పూరిగారి మీదున్న ప్రేమతో వర్క్‌ చేశారు. ఈ అవకాశం ఇచ్చిన పూరిగారికి, ఛార్మిగారికి థాంక్స్‌” అన్నారు.

ఫైట్‌ మాస్టర్‌ రియల్‌ సతీష్‌ మాట్లాడుతూ – ”నా మీద నమ్మకంతో ఈ సినిమాకి వర్క్‌ చేసే అవకాశాన్ని ఇచ్చిన పూరిగారికి, ఛార్మిగారికి నా థాంక్స్‌. మా యూనిట్‌ అంతా కలిసి ఒక అద్భుతమైన సినిమాకి వర్క్‌ చేశాం. స్పెషల్‌గా ఆకాష్‌ ఎక్కడా డూప్‌ లేకుండా డేరింగ్‌గా ఫైట్స్‌ చేశాడు. ప్రతి ఒక్కరూ మైనస్‌ డిగ్రీలో కూడా జోర్డాన్‌లో చాలా హార్డ్‌వర్క్‌ చేశారు. ఛేజ్‌ సీన్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లలో ఆకాష్‌ వండ్రఫుల్‌గా చేశాడు” అన్నారు.

హీరోయిన్‌ నేహాశెట్టి మాట్లాడుతూ – ”తెలుగులో ఇది నా ఫస్ట్‌ మూవీ. ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్‌లో నటించాను. ఛార్మి ఎంతో సపోర్ట్‌ చేసి ఎంకరేజ్‌ చేశారు. ఇట్స్‌ ఎ బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరి. ఆకాష్‌ వెరీ ఫెంటాస్టిక్‌ యాక్టర్‌. స్పెషల్‌గా పూరి జగన్నాథ్‌గారికి, మా సినిమాని రిలీజ్‌ చేస్తున్న దిల్‌ రాజుగారికి నా థాంక్స్‌” అన్నారు.
విషురెడ్డి మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో మెయిన్‌ విలన్‌గా నటించాను. అందరం కష్టపడి కాకుండా చాలా ఇష్టపడి వర్క్‌ చేశాం. మా అందరి మనసులకి చాలా దగ్గరైన సినిమా ఇది. పూరిగారి మీద వున్న రెస్పెక్ట్‌తో సినిమా బాగా రావాలని డే అండ్‌ నైట్‌ ఈ సినిమా కోసం పని చేశాం. ఫైనల్‌గా సినిమా అద్భుతంగా వచ్చింది. 2018 ‘మెహబూబా’ వెరీ బిగ్‌ హిట్‌ మూవీ అవుతుంది” అన్నారు.

ఆకాష్‌ పూరి, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రంలో విషురెడ్డి, మురళి శర్మ, అశ్వని, జ్యోతిరానా, టార్జాన్‌, షేక్‌ జునైద్‌, షాయాజీ షిండే, షయల్‌ ఖాన్‌, సురభి, రూప, అజయ్‌, పృధ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ చౌతా, ఆర్ట్‌: జానీ షేక్‌, డిఓపి: విష్ణు శర్మ, ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధికీ, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌: అనిల్‌ పాడూరి, (ఆద్విత క్రియేటివ్‌ స్టూడియో), సమర్పణ: శ్రీమతి లావణ్య, నిర్మాణం: పూరి కనెక్ట్స్‌, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

- Advertisement -