అవినాష్ పై మెహబూబ్ బిగ్ బాంబ్

180
mehboob
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 71 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 71వ ఎపిసోడ్‌లో అంతా ఉహించినట్లే ఇంటి నుండి మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. స్నేహితులైన సొహైల్,మెహబూబ్ ఇద్దరిలో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు.

స‌క్సెస్ కోసం ప‌దేళ్లుగా క‌ల కంటున్నా అని సోహైల్‌, క‌ష్ట‌ప‌డుతున్నాను కానీ దుర‌దృష్టం వెంటాడుతోంద‌ని మెహ‌బూబ్ బాధ‌ప‌డ్డాడు. మెహ‌బూబ్ చెప్పిన‌ట్టుగానే అత‌డి నెత్తి మీద ద‌రిద్రం దాండియా ఆడింది. దీంతో ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు. మెహబూబ్ ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులంతా కంటతడి పెట్టారు. ముఖ్యంగా సొహైల్ కన్నీటిపర్యంతం అవడం అందరిని కలిచివేసింది. టాప్ 5లో ఉంటామంటూ ఇప్పుడు వెళ్లిపోతున్నాడ‌ని ఏడ్చేశాడు. అభిజిత్,హారికతో సహా అంతా కన్నీటిపర్యంతం అయ్యారు.

హౌస్‌ను వీడి వ‌చ్చేసిన మెహ‌బూబ్ త‌న‌కు బిగ్‌బాస్ షో చాలా నేర్పింద‌ని, అంద‌రూ త‌న‌కు స్విమ్మింగ్ కూడా నేర్పార‌ని చెప్పుకొచ్చాడు. హౌస్‌లో అభిజిత్ త‌న‌కు అన్న‌లాగా ఉన్నాడ‌ని వెక్కివెక్కి ఏడ్చాడు. ఇంత హార్డ్ వ‌ర్క్ చేసేవారిని తానెప్పుడూ చూడ‌లేద‌ని అభి చెప్పుకొచ్చాడు. ఇక‌ ఎవ‌రికి ఆరోగ్యం బాగోలేక‌పోయినా మోనాల్ ద‌గ్గ‌రుండి చూసుకుంటుంద‌ని, హౌస్‌లో బెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ అవినాష్ అని, అఖిలే నంబ‌ర్ 1 అని మెహ‌బూబ్ చెప్పుకొచ్చాడు.

చివ‌ర‌గా ఓ హిందీ పాట‌కు ఆర్తిగా డ్యాన్స్ చేస్తూ అంద‌రినీ ఏడిపించేశాడు. వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబును అవినాష్‌పై వేశాడు. ఇది కూడా అవినాష్ ఇష్టంతోనే. ఒక వారం అవినాష్ నాన్ వెజ్ తినకూడదు, గుడ్డుతో సహా.దీంతో ఎపిసోడ్ ముగిసింది.

- Advertisement -