‘జెంటిల్ మేన్ 2’ వచ్చేస్తోంది..

296
Gentleman sequel

జెంటిల్ మేన్.. 1993లో తమిళం తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించి హీరో అర్జున్ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది.. ఈ చిత్రం ద్వారా శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇక అసలు విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించిన నిర్మాత పేరు కె.టి.కుంజుమోన్. ఆ చిత్రం వచ్చిన 27 సంవత్సరాలకు ఇప్పుడు దానికి సీక్వెల్ చేస్తున్నట్టుగా నిర్మాత కుంజుమోన్ ప్రకటించారు.

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”జెంటిల్‌మేన్ మూవీ తమిళ‌, తెలుగు భాష‌ల‌లో విడుద‌లై భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అనువాదించ‌బ‌డి అన్ని దేశాల ప్రేక్ష‌కుల‌నుంచి మంచి రెస్పాన్స్ రాబ‌ట్టుకుంది. అయితే మ‌రోసారి అంద‌రి అంచ‌నాల‌ను అందుకునేలా రెండింత‌లు గొప్ప‌ద‌నంతో జెంటిల్‌మేన్ 2 తెర‌కెక్కిస్తున్నాం.

అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో హాలీవుడ్ చిత్రాల‌కు ధీటుగా లేటెస్ట్ ప్రొడక్షన్ టెక్నిక్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం” అన్నారు. ఈ చిత్రాన్ని త‌మిళ‌, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాష‌ల‌లో జెంటిల్‌మేన్ ఫిలిం ఇంట‌ర్‌నేష‌న‌ల్ సంస్థ‌ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తుంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్రకటించనున్నారు.