టాలీవుడ్ లో యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చేస్తున్న చిరూ, ఈ సినిమా తర్వాత బ్రేక్ తీసుకోనున్నాడు. దానికి కారణం కథ దొరక్కపోవడమే. వాస్తవానికి ఈ సినిమా తర్వాత చిరూ, వెంకీ కుడుములతో సినిమా చేయాల్సింది కానీ, అది క్యాన్సిల్ అయింది. దీంతో, నిర్మాత దానయ్య చిరు కోసం కథ వెతికే పనిలో పడ్డారు. అయితే, మెగాస్టార్ కోసం దర్శకుడు పూరి జగన్నాధ్ ఓ పక్కా మాస్ ఎమోషనల్ యాక్షన్ కథను రాస్తున్నాడని తెలుస్తోంది.
మరి, పూరి రాసే కథ మెగాస్టార్ కి నచ్చితే.. భోళా శంకర్ సినిమా తర్వాత పూరితో సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఇక ప్రస్తుతానికి మెగాస్టార్ భోళా శంకర్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి సోదరిగా నటిస్తున్న కీర్తి సురేశ్‌కు ప్రియుడిగా సుశాంత్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకే మెగాస్టార్ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. సినిమాలోనే ఈ షేడ్స్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.
ఈ సినిమాలో దర్శకుడు మెహర్ రమేష్ రెండు మాస్ ట్రాక్ లు యాడ్ చేశారు. మాస్ ఎలివేషన్లను మెహర్ రమేష్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. పైగా మాస్ ఎలివేషన్లలో మెగాస్టార్ చిరంజీవి కూడా అదిరిపోతారు. మొత్తానికి సిస్టర్ సెంటిమెంట్ తో పాటు భారీ యాక్షన్ టచ్ తో ఈ ‘భోళా శంకర్’ రాబోతున్నాడు. మరి ఈ ‘భోళా శంకర్’ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మెగా ఫ్యాన్స్ ఐతే, ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అన్నట్టు చిరు కెరీర్ లో ఈ సినిమా మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి…