హైరెంజ్ బుక్ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్‌లో అంబేద్కర్ విగ్రహం…

51
- Advertisement -

ఏప్రిల్‌ 14న నగరం నడిబొడ్డున 125అడుగుల ఎత్తులో భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహంను సీఎం కేసీఆర్‌, అంబేద్కర్ మనుమడు ప్రకాశ్‌అంబేద్కర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనికి హైరేంజ్ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌లో డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నమోదైంది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ను సీఎం కేసీఆర్‌ పేరు మీద మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సమర్పించారు.

దేశ విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు ప్రసార మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెబుతున్నారని వెల్లడించారు. రానున్న ప్రపంచ స్థాయిలోనే అంబేద్కర్ విగ్రహం టూరిజం స్పాట్‌గా మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, న్యూమరాలజిస్ట్ దైవజ్ఞశర్మ, జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్, హైరేంజ్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్స్ శ్రీకాంత్, సుమన్ పల్లె తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

కూల్చడమే.. బీజేపీ ఏజెండా?

CAPF:కేటీఆర్ లేఖతో దిగొచ్చిన కేంద్రం…!

CMKCR:విగ్రహాం కాదు…నిలువెత్తు నిదర్శనం:కేసీఆర్‌

- Advertisement -