డిసెంబర్‌ 5న టీడీపీలోకి చిరంజీవి..?

227
online news portal
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి.తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. సినీరంగంలో అగ్రహీరోగా వెలిగిన చిరు..ప్రజా రాజ్యం పార్టీని స్థాపించారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్రమంత్రయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న చిరు…రాజకీయాలకు కాస్త విరామమిచ్చి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తతుం ఖైదీ నెంబర్ 150లో బిజీగా ఉన్నారు మెగాస్టార్.

ప్రస్తుతం చిరుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. త్వరలో చిరుంజీవి హస్తం పార్టీని విడిచి పెట్టి సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఊహాగానాలు జోరందకున్నాయి. చిరు…టీడీపీలో చేరికకు వేగంగా పావులు కదులుతున్నాయని సమాచారం. ఇందుకోసం ఏకంగా పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి,చంద్రబాబు తనయుడు నారాలోకేష్ రంగంలోకి దిగారట. నారా లోకేష్ నేరుగా చిరంజీవిని పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం…చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్నీ జరిగిపోయాయట. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉంటానని..తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని చిరునే స్వయంగా లోకేష్‌కు చెప్పారని సన్నిహిత వర్గాల సమాచారం. డిసెంబర్‌ 5న ఏపీ రాజధాని అమరావతిలో చిరు టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నాట.

chiru

కొంతకాలం సోదరుడు పవన్ స్థాపించిన జనసేనలో చిరంజీవి చేరుతారని ప్రచారం జరిగిన…జనసేన కంటే టీడీపీలో చేరడమే సేఫ్ అని చిరు భావించారట. చిరు పార్టీలోకి వస్తే ముద్రగడ పద్మనాభం కు చెక్ పెట్టొచ్చు.ఇటు కాపుల మద్దతు కూడగట్టుకోవచ్చని టీడీపీ భావిస్తోంది. ఈ వార్తకు ఊతమిస్తూ ప్రైవేటు సంస్థలైన మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ బోర్డు డైరెక్టర్ గా ఉన్న ట్రూ జెట్ సంస్థ బ్రాండ్ టర్బో మెగా ఎయిర్ వేస్ సంస్థకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద ఏపీ ప్రభుత్వం రూ. 4.90కోట్లు మంజూరు చేసింది.

ramcharan_trujet

విజయవాడ – కడప, విజయవాడ – తిరుపతి మధ్య వారంలో నాలుగు రోజులపాటు ప్రయాణికులు ఉన్నా లేకున్నా సర్వీసులు నిర్వహిస్తున్నందుకు జరిగే నష్టాన్ని భరించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం 72 సీట్ల సామర్ధ్యం ఉన్న ఏటీఆర్ – 72 విమానాలను ట్రూ జెట్ నడుపుతోంది. ప్రతి సర్వీసులో ఐదు సీట్లను ఈ సంస్థ ప్రభుత్వానికి కేటాయిస్తోంది. ఏడాదిలో 672 సర్వీసులు నడిపినందుకు గాను ప్రభుత్వం రూ.9.76 కోట్లు చెల్లించాల్సి ఉండాగా.. తొలి విడత నష్టపరిహారంగా రూ. 4.90 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.

chiranjeevi-

ఇక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్….టీడీపీ-బీజేపీకి మద్దతిచ్చి అధికారంలోకి రావటంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ,బీజేపీలపై పవన్ సమరానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో మెగాస్టార్ టీడీపీలో చేరుతారన్న వార్తలు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఇటు తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా అన్ని పార్టీల నేతలు అధికార టీఆర్ఎస్‌లోకి క్యూకడుతుండగా…ఇదే వ్యుహాన్ని ఏపీలో టీడీపీ అనుసరిస్తోంది. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా కీలక నేతలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్న చంద్రబాబు…కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని టీడీపీలో చేర్చుకోవటం ద్వారా లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. మొత్తంగా చిరు…టీడీపీలో చేరితే రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

chiru

- Advertisement -