కమిట్‎మెంట్ ఉన్న నటుడు మాదాల-చిరంజీవి

326
Mega Star Chiranjivi
- Advertisement -

నటుడు మాదాల రంగారావు మృతిపై మెగాస్టార్ చిరంజీవి దిగ్బాంతి వ్యక్తం చేశారు. మాదాల రంగారావు పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, అనంతరం మీడియాతో మాట్లాడాతూ.. ఈ రోజున ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం, ఆయన మరణంతో నేను చాలా ఆవేదనకు లోనయ్యా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని
కోరుకుంటునాని తెలిపారు.

madala rangarao

ఇక ఆయనతో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. నా కెరీర్ ఆరంభం నుంచే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్లలో మాదాల రంగారావు కూడా ఉన్నారని చెప్పారు. ఒంగోలులో నేను చదువుకునే రోజులనుంచే ఆయనతో పరిచయాలు ఉన్నాయి. నేను చెన్నైలో ఉన్నప్పుడు మేం ఇద్దరం అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లం.

ఆయన నాపై ప్రత్యేక అభిమానం చూపించే వారు. మనం అందరం ఒంగోలు నుంచి వచ్చామయ్యా.. అభివృద్ధి చెంది ఒంగోలు పేరు నిలబెట్టాలి అని ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఆయన కమిట్‎మెంట్ ఉన్న నటుడు విప్లవాత్మక సినిమాల్లోనే నటించారు. కమర్షియల్ సినిమాలో నటించే అవకాశాలు ఎన్నో వచ్చినప్పటికీ ఆయన తిరస్కరించారని చిరంజీవి చెప్పుకొచ్చారు.

- Advertisement -