టాలీవుడ్ లో మెగా ఫ్యామిలి నుంచి దాదాపు అరడజను మంది హీరోలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈఫ్యామిలి నుంచి మరో హీరో రానున్నాడు. మెగాస్టార్ చిరంజివి చిన్న చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ చివరి వరకూ వచ్చిందన్నారు చిత్ర నిర్మాత. ఇక ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ను కూడా మొదలుపెట్టేశాడు హీరో కళ్యాణ్ దేవ్. ఈసినిమాను త్వరలో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈసినిమా స్క్రిప్ట్ విషయంలో మెగాస్టార్ చిరంజివి , రామ్ చరణ్ లు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని సమచాారం. చిరంజివి అల్లుడిని గ్రాండ్ గా రిలిజ్ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాడు నిర్మాత సాయి కొర్రపాటి.
కళ్యాణ్ దేవ్ సరసన హీరోయిన్ గా మాళవిక నాయర్ నటిస్తుంది. కొత్త దర్శకుడు రాకేశ్ శశి ఈసినిమాకు దర్శకత్వం వహించగా..సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సినిమా నిర్మాణ పనులు చిరంజివి దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం. అర్జున్ రెడ్డి సినిమాకు మ్యూజిక్ అందించిన హర్షవర్దన్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. మెగా ఫ్యామిలి నుంచి వచ్చిన వారిలో ఎవరి టాలెంట్ ను వారు నిరూపించుకున్నారు. ఎలాంటి కష్టం లేకుండా ఇండస్ట్రీకి వచ్చినా తమకంటూ ఒక స్టైల్ ను ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. కొత్తగా వస్తున్న చిరంజివి చిన్న అల్లుడు ఎమేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడొ వేచిచూడాలి. ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా చిత్రికరిస్తున్నట్లు తెలిపారు నిర్మాత సాయి కొర్రపాటి. త్వరలోనే ప్రమోషన్స్ కూడా మొదలుపెడతామన్నారు.