తనువులు వేరైనా మన లక్ష్యం ఒక్కటే:పవన్‌కు చిరు విషెస్

154
pawan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 50వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే ..మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే .. తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే .. తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కళ్యాణ్ బాబు హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ చిరు ట్వీట్ చేశారు.

మాన‌వ‌త్వం ఉన్న మంచి మ‌నిషికి, నా ఫ్రెండ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు. ఈ ఏడాది ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను అని వెంకీ త‌న ట్వీట్ ద్వారా తెలిపారు.