వెండితెర….సీతయ్య

259
harikrishna

తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఫ్యామిలీలలో నందమూరి, మెగా ఫ్యామిలీ ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రెండు కుంటుంబాలకు సంబంధించిన ఇద్దరు ప్రముఖుల పుట్టిన రోజు ఒకే రోజు కావడం గమనార్హం. వీరే హరికృష్ణ, పవన్ కళ్యాణ్.

అభిమానులు సీతయ్య అని ముద్దుగా పిలుచుకునే నందమూరి హరికృష్ణ 1956, సెప్టెంబర్ 2న జన్మించారు. స్వర్గీయ ఎన్టీఆర్ కుమారుడు అయిన హరికృష్ణ చిన్న వయస్సులోనే శ్రీకృష్ణావతారం సినిమాలో బాలకృష్ణడి గా నటించారు. తరువాత ‘తల్లా పెళ్ళమా’, ‘తాతమ్మ కల’ వంటి సినిమాలలో నటించారు. దాన వీర శూర కర్ణ సినిమాలో అర్జునుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

చాలా కాలం తరువాత శ్రీరాములయ్య సినిమాతో అభిమానుల ముందుకు వచ్చారు. లాహిరి లాహిరి లాహరిలో.., సీతయ్య వంటి హిట్ సినిమాలో నటించి అభిమానులను అలరించారు. హరికృష్ణకు మొత్తం నలుగురు సంతానం. వీరిలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా తమ సత్తా చూపిస్తున్నారు. 2018లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే.