ఫ్లాస్మా దాతలకు ధన్యవాదాలు: చిరంజీవి

81
chiranjeevi

కరోనా లాంటి విపత్కర పరిస్ధితుల్లో ఫ్లాస్మా సంజీవనిలా పనిచేస్తుందని…ఫ్లాస్మా దాతలకు ధన్యవాదాలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ఫ్లాస్మా డోనర్ల సన్మాన కార్యక్రమానికి హాజరైన చిరు..150 మంది డోనర్లను సీపీ సజ్జనార్‌తో కలిసి సన్మానించారు.

క‌రోనా బాధితుల‌కు ప్లాస్మా ఇస్తే 99 శాతం బ‌తికే అవకాశం ఉందన్నారు చిరంజీవి. ఒక‌రి ప్లాస్మా నుంచి 30 మందికి సాయం చేయొచ్చ‌ని… ప్లాస్మా దానం వ‌ల్ల ర‌క్తం న‌ష్ట‌మ‌నేది ఉండ‌ద‌ని, ప్లాస్మా త‌గ్గినా 24 నుంచి 48 గంటల్లో మ‌ళ్లీ త‌యార‌వుతుంద‌న్నారు. క‌రోనా నుంచి కోలుకున్నవారు ధైర్యంగా ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చారు.

ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స‌హ‌కారంతో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ సేవ‌లు కొన‌సాగుతున్నాయ‌ని.. బ్ల‌డ్ బ్యాంక్‌కు అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. రక్త‌దానం చేసేలా అభిమానుల‌ను ప్రోత్స‌హించాను. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతుందన్నారు.ఇలాంటి ప‌రిస్థితుల్లో ముందుండి పోరాడుతున్న పోలీసులు, డాక్ట‌ర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి ధ‌న్యవాదాలు తెలిపారు.