తమిళ సినిమా రీమేక్ అయినప్పటికీ.. రాయలసీమ ఫ్యాక్షన్, మైనింగ్ ఇలాంటి వ్యవహారాలు కలిపి మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ సినిమా కథ వుంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. షూటింగ్ జరుగుతోంది కూడా. ఈ సినిమాలో మాస్ ఎలివేషన్లు ఎలాగూ వుంటాయి. దర్శకుడు మెహర్ రమేష్ మాస్ ఎలివేషన్లు బాగా హ్యాండిల్ చేస్తాడని పేరు ఉంది. పైగా ఇలాంటి మాస్ ఎలివేషన్లలో మెగాస్టార్ కూడా అదిరిపోతారు. గతంలో చిరు సినిమాలు హిట్ అయిందే ఆ ఎలివేషన్లతో.
అయినా మెగాస్టార్ లాంటి మాస్ హీరో అంటే ఆ మాత్రం ఎలివేషన్లు ఎలాగూ అవసరం పడతాయి. దీనికి తోడు కొత్తగా ఒకటి రెండు ట్రాక్ లు కూడా యాడ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా భారీ సక్సెస్ కావాలంటే.. సిస్టర్ సెంటిమెంట్ తో పాటు కనకదుర్గ అమ్మవారి డివోషనల్ టచ్ కూడా ఉండాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. మెగాస్టార్ కి కూడా ఈ ఐడియా బాగా నచ్చింది. అందుకే, డివోషనల్ టచ్ తో ఒకటి రెండు సీన్లు చేర్చడానికి ప్రయత్నించమని చిరంజీవి కూడా కోరినట్లు తెలుస్తోంది.
చిరు మరియు నిర్మాతల కోరిక మేరకు వున్న సీన్లలోనే ప్రస్తుతం మెహర్ రమేష్ అడ్ఙస్ట్ మెంట్ లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే స్వతహాగా డివోషనల్ కంటెంట్ ఎక్కువ రాసే ఒకరి ఇద్దరు రైటర్స్ తో కొన్ని డైలాగుల్లో ఈసారి కాస్త డివోషనల్ టచ్ ఇస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ భోళా శంకర్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి…