చిరు ‘గాడ్ ఫాదర్’ నుండి లేటెస్ట్‌ అప్‌డేట్‌..

154
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 153వ సినిమా ‘గాడ్ ఫాదర్’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవి కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, ఇతర ముఖ్య తారాగణం మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కాగా తాజాగా ఈ మూవీ నుండి లేటెస్ట్‌ అప్‌ డేట్ వచ్చింది.

ఈ సినిమాలో కొన్ని కీలకమైన పాత్రలు ఉన్నాయి. వీటిలో ఓ పాత్రను సీనియర్ నటుడు విజయ్ చందర్ చేయబోతున్నారట.‘గాడ్ ఫాదర్’ సినిమాలో మెగాస్టార్‌కి ఫాదర్‌గా విజయ్ చందర్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం పాత్రలో విజయ్ చందర్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక సీనియర్ హీరోయిన్ కుష్బూ కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్ర చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమన్‌ సంగీత అందిస్తున్నాడు.

- Advertisement -