వారి రాజీనామాలు ఇంకా అందలేదు- మంచు విష్ణు

29

ఇటీవల ‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న మంచు విష్ణు సోమవారం తండ్రి మోహన్ బాబు, అక్క లక్ష్మీ ప్రసన్నతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో స్వామి వారికి మొక్కులు చెల్లించానని, ‘మా’ సభ్యుల రాజీనామా అంశం మీడియా ద్వారానే తెలిసిందని, ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో గెలిచినవారి రాజీనామాలు ఇంకా అందలేదని తెలిపారు. అవి అందిన తర్వాతే వాటిపై స్పందిస్తానన్నారు.

ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఎన్నికల్లో విజయం కోసం తన ప్యానెల్ ఎంతో కష్టపడిందని, స్వామివారి ఆశీస్సుల కోసమే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. అసోయేషన్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని విష్ణు పేర్కొన్నారు.