లారెన్స్‌కి 10 లక్షలు ఇచ్చిన చిరు.. ఎందుకో తెలుసా..?

341
Megastar Chiranjeevi
- Advertisement -

రాఘవ లారెన్స్‌, ఓవియా, వేదిక, కొవైసరళ, శ్రీమాన్‌ ప్రధాన తారాగణంగా నటిస్తోన్న చిత్రం ‘కాంచన 3’. లారెన్స్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రాఘవ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్‌ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలవుతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో లారెన్స్‌ చారిట్రబుల్‌ ట్రస్ట్‌ బ్రోచర్‌ను అల్లు అరవింద్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా.. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ – ”పాతికేళ్లుగా మా కుటుంబానికి లారెన్స్‌ చాలా మంచి సన్నిహితుడు. చిన్న డ్యాన్సర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి ‘హిట్లర్‌ సినిమాకు డ్యాన్స్‌ మాస్టర్‌గా మారి.. ఇప్పుడు లారెన్స్‌ ఓ బ్రాండ్‌లా తయారయ్యాడు. అతని సినిమా వస్తుందంటే, అందరూ వెయిట్‌ చేస్తున్నారు. కేవలం డబ్బు సంపాదించాలనే ఉద్దేశం లారెన్స్‌కు లేదు. సంపాదించిన దాన్ని పది మందికి పంచాలనుకుంటాడు. అలాంటి మనస్తత్వం ఉన్న చిరంజీవి తన శిష్యుడ్ని అభినందిస్తూ 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఆయన తరపున నేను లారెన్స్‌కు చెక్కును అందిస్తున్నాను” అన్నారు.

Megastar Chiranjeevi

రాఘవ లారెన్స్‌ మాట్లాడుతూ – నేను ఇక్కడ డ్యాన్స్‌ మాస్టర్‌గా రాణించడానికి ముందు చిరంజీవిగారే నన్ను సెలక్ట్‌ చేసి నువ్వు బాగా ఎదుగుతావురా అని చెప్పారు. ఆయన ఆశీర్వాదం వల్లే ఈ స్టేజ్‌లో ఉన్నాను. ఆయన నాకు హిట్లర్‌ సినిమాలో డ్యాన్స్‌ మాస్టర్‌గా చాన్స్‌ ఇవ్వకుంటే.. నేను నెంబర్‌ వన్‌ డ్యాన్స్‌ మాస్టర్‌ని అయ్యేవాడినే కాను. నాగార్జునగారు డైరెక్షన్‌ చాన్స్‌ ఇచ్చేవారే కారు. ఇప్పుడు 150 పిల్లలకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయించేవాడిని కాను. నా ఇంట్లో 60 మంది పిల్లలు చదివేవాళ్లు కారు. ఇన్ని జరుగుతున్నాయంటే కారణం నన్ను ఆశీర్వదించిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌గారికి.. అన్నయ్య చిరంజీవిగారికి… నన్ను డైరెక్టర్‌ని చేసిన నాగార్జునగారికి థాంక్స్‌..

ట్రస్ట్‌ స్టార్ట్‌ చేస్తున్నానని చిరంజీవి అన్నయ్యకు చెప్పగానే.. ఆయన తాను కేరళకు వెళుతున్నానని చెప్పారు. ఆయన వీడియో బైట్‌ పంపుతారని అనుకున్నారు. కానీ ముందు ఆయన పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆయన నాకు మనిషి రూపంలోని దేవుడు. ఆయన ఆశీర్వాదం ఉంటే.. ఈ చారిట్రబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎన్నో మంచి పనులు చేయాలనుకుంటున్నాను. ఇలా చేయడం నా బాధ్యత అని అనుకుంటున్నాను. హెల్ప్‌ చేస్తే అది సరైన వాళ్లకి అందాలి. అలా కష్టాల్లో ఉన్న వారి ఇంటికి వెళ్లి వారి కష్టాలు తెలుసుకుని వారికి అన్నయ్య ఇచ్చిన పది లక్షల రూపాయలను ఇస్తాను. వారంరినీ అన్నయ్య దగ్గరకు పిలుచుకుని వచ్చి చూపిస్తాను. నాకు డ్యాన్స్‌ మాస్టర్‌గా చాన్సులు ఇచ్చిన అందరికీ థాంక్స్‌” అన్నారు.

- Advertisement -