జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్‌కి మద్దతు ఇచ్చే విషయంపై మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గాడ్‌ఫాదర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మెగాస్టార్ మాట్లాడుతూ…తాను జనసేన పార్టీకి మద్దతు ఇస్తానో..? లేదో..? భవిష్యత్తే నిర్ణయించాలన్నారు. నా తమ్ముడి, నిబద్దత నాకు తెలుసు. పవన్ కల్యాణ్ లాంటి నిబద్దత ఉన్న నాయకుడు మనకు రావాలి. నా ఆకాంక్ష కూడా అదే..దానికి నా మద్దతుంటుందన్నారు. మేమిద్దరం చెరొక వైపు ఉండటం కంటే నేను పక్కకు తప్పుకోవడమే ఉత్తమమని రాజకీయాల నుంచి వైదొలిగినట్టు చిరంజీవి తెలిపారు. పవన్‌కు రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం ప్రజలు ఇచ్చే రోజు రావాలని నేను కోరుకుంటున్నానన్నారు.
పవన్ నా తమ్ముడు..మంచి నాయకుడు అవుతాడు. ఏ పక్షాన ఉంటానేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ అలాంటివాడు రావాలనేది నా ఆకాంక్ష. పవన్ నిజాయితీ, నిబద్దత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. పవన్ కల్యాణ్ లాంటి నిబద్దత కలిగిన వ్యక్తి నాయకుడిగా రావాలని కొరుకుంటున్న. పవన్‌కు నా పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 2024లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ముందుకెళ్తున్న నేపథ్యంలో..చాలా రోజుల తర్వాత చిరంజీవి మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి.