మెగాస్టార్ చిరంజీవి సైరా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈచిత్రానికి సురెందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న ఈసినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ చిత్రం తర్వాత చిరంజీవి ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తాడనే వార్త ఫిలీం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవితో సినిమా చేయడానికి చాలా మంది దర్శకుడు క్యూలో ఉన్నా ఆయన మాత్రం కొరటాల శివకు అవకాశం ఇచ్చాడన్న విషయం తెలిసిందే.
అందుకోసం కొరటాల శివ స్క్రీప్ట్ వర్క్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఇంతవరకూ కొరటాల తీసిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్లుగా నిలవడంతో ఆయనకు అవకాశం ఇచ్చాడు చిరు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం చిరు తర్వాతి సినిమా కొరటాలతో కాకుండా వేరే దర్శకుడితో మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది.
మొన్న జరిగిన వినయ విధేయ రామ ఆడియో లాంచ్ లో ఆ దర్శకుడి పేరును కూడా చెప్పేశాడు చిరంజీవి. తన తర్వాతి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్లు ప్రకటించారు మెగాస్టార్. ఇన్ని రోజులు చిరంజీవిపై ఆశలు పెట్టుకున్న కొరటాలకు ఏంచేయాలో అర్ధం కాని పరిస్ధితిలో ఉన్నాడట. వేరే హీరోలతో సినిమా చేద్దామన్నా వారు పుల్ బిజీగా ఉన్నారు. చూడాలి మరి కొరటాల తర్వాతి సినిమా ఎవరితో చేస్తాడో.