విష్ణుకు పాస్ మార్కులు కూడా రావు:నాగబాబు

174
nagababu
- Advertisement -

మా ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మెగాబ్రదర్ నాగబాబు. మంచు విష్ణు మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు ..తెలుగు పరీక్ష రాస్తే విష్ణుకు పాస్ మార్కులు కూడా రావు అంటూ సంచలన విమర్శలు చేశారు. ప్రకాశ్ రాజ్ ని తెలుగోడంటారు, విష్ణును తెలుగు నేర్చుకొమ్మంటారని కామెంట్ చేశారు.

సినిమా జ్ఞానం, ప్రపంచజ్ఞానం ఉన్న ప్రకాశ్ రాజ్ కే నా మద్దతు అంటూ స్పష్టం చేశారు. దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్ అని.. ప్రకాశ్ రాజ్ కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవన్నారు. ఇక ప్రకాశ్ రాజ్‌ను మోహన్ బాబును పోల్చిన నాగబాబు… విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్ బాబుకు తెలుసు, నటీనటులకు ఏం కావాలో ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రకాశ్ రాజ్ కే తెలుసన్నారు.

నిర్మాతలతో వివాదం ప్రకాశ్ రాజ్ కే కాదు మోహన్ బాబు కుటుంబానికి కూడా ఉన్నాయని విమర్శించారు. సలీం చిత్రం విషయంలో డైరెక్టర్ వైవీఎస్ చౌదరినే మోహన్ బాబు అదోగతి పట్టించారని ఆరోపించారు. విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ చదువుకున్నావు అని ప్రశ్నించారు.

- Advertisement -