మెగా సపోర్ట్ .. అయినా పనవ్వలేదు!

22
- Advertisement -

ఏ హీరో కయినా హిట్లు , ఫ్లాపులు అనేవి సహజమే. కాకపోతే వరుస డిజాస్టర్స్ వస్తే మాత్రం ఆ హీరో గ్రాఫ్ డౌన్ అవుతుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే ఫేజ్ లో ఉన్నాడు సంతోష్ శోభన్. ‘వర్షం’ దర్శకుడు శోభన్ తనయుడిగా ‘తను నేను’ సినిమాతో హీరోగా పరిచయమైన సంతోష్ శోభన్ ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేశాడు.

చేసిన ప్రతీ సినిమాకి ప్రభాస్ సపోర్ట్ అందుకున్నాడు సంతోష్. యూవీ సపోర్ట్ తో రెండు మూడు సినిమాలు చేసాడు. కానీ వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు మెగా సపోర్ట్ అనుకున్నాడు. చిరు తనయురాలు సుష్మిత నిర్మాతగా ‘శ్రీదేవి శోభన్’ అనే సినిమా చేసి శివరాత్రి సందర్భంగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయినా పనవ్వలేదు. నిన్నే పెళ్ళాడతా లైన్ తీసుకొని దానికి నువ్వే నువ్వే ట్రీట్ మెంట్ ఇవ్వడంతో సినిమా రొటీన్ అంటూ ప్రేక్షకులు టాక్ ఇచ్చారు.

కంటెంట్ వీక్ గా ఉండటంతో ఈ సినిమాను ప్రేక్షకులు రిలీజ్ రోజే తిప్పి కొట్టారు. ప్రమోషన్స్ కూడా లేకపోవడంతో కలెక్షన్స్ కూడా డల్ గానే ఉన్నాయి. సంతోష్ హీరోగా నటించిన ఏ సినిమా ఇంతవరకు థియేటర్స్ లో హిట్ అవ్వలేదు. దీంతో కుర్ర హీరోకి హిట్ దక్కేదెప్పుడో అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏక్ మినీ కథతో ఓటీటీ లో మంచి వ్యూస్ అందుకున్న సంతోష్ థియేటర్స్ లో హిట్ కొట్టే తరుణం ఎప్పుడొస్తుందో మరి !

ఇవి కూడా చదవండి…

ఓబుగా వచ్చి ఉంటే సక్సెస్ అయ్యేవాడేమో

పెళ్ళై, తల్లి అయినా ఫుల్ డిమాండే

వామ్మో… ధనుష్ 15 కోట్లు!

- Advertisement -