అన్నదమ్ములు ఒకే బేనర్లో ఎందుకో ?

129
- Advertisement -

కొందరు హీరోలు రిపీటెడ్ గా ఒకే బేనర్ లో సినిమాలు చేస్తూ ఆ నిర్మాతతో సన్నిహితంగా ఉంటారు. ఇది సహజమే. కానీ ఒకే బేనర్ లో అన్నదమ్ముల్లు నాలుగు సినిమాలు చేస్తే అందరూ మాట్లాడుకుంటారు. తాజాగా మెగా మేనల్లుళ్ళు సాయి ధరం తేజ్ , వైష్ణవ్ తేజ్ కూడా ఒకే బేనర్ లో కంటిన్యూ గా సినిమాలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. అవును సాయి ధరం తేజ్ బీవీఎసెన్ ప్రసాద్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నాడు. బ్లాక్ మేజిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకుడు.

తాజాగా తేజ్ ఇంకో సినిమా మొదలు పెట్టాడు. ఆ సినిమా కూడా ఇదే బేనర్ లో ప్రసాద్ నిర్మాణంలోనే చేస్తున్నాడు. దీనికి జయంత్ దర్శకుడు. జయంత్ కి ఇదే మొదటి సినిమా ఇటివలే తేజ్ కి కథ చెప్పి ఇంప్రెస్ చేసి ప్రాజెక్ట్ లాక్ చేసేసుకొని తాజాగా సినిమాను లాంచ్ చేసుకున్నాడు. ఇక తేజ్ విషయం పక్కన పెడితే పంజా వైష్ణవ్ తేజ్ కూడా ప్రసాద్ నిర్మాణంలోనే రెండు రెండో సినిమా చేస్తున్నాడు. ఇటివలే రంగ రంగ వైభవంగా చేసిన వైష్ణవ్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రలో మరో సినిమా స్టార్ట్ చేసి షూటింగ్ జరుపుకుంటున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల వైష్ణవ్ కి జోడి కడుతుంది.

ఏదేమైనా ఒకే బేనర్ లో కంటిన్యూ గా అన్నదమ్ములు కలిసి నాలుగు సినిమాలు చేస్తుండటంతో వీరికి బల్క్ రెమ్యునరేషన్ ఏమైనా ఇచ్చారా ? అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి…

విదేశాల్లో అదరగొడుతున్నారు

వివాదాలకు కేరాఫ్ నోరా ఫతేహి…

పిక్ టాక్ : వయ్యారం వర్సెస్ గ్లామరసం

- Advertisement -