వివాదాలకు కేరాఫ్ నోరా ఫతేహి…

130
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి బాలీవుడ్‌ సినిమాలతో వెండితెరకు పరిచయమైన నోరాఫతేహి. టాలీవుడ్‌కి మాత్రం ఐటమ్‌ సాంగ్స్‌తో పరిచయమయ్యారు. టెంపర్‌ సినిమాలోని ఇట్టాగే రెచ్చిపోదాం అనే ఐటమ్ సాంగ్‌తో కనివిందు చేశారు. తదుపరి బహుబలి సినిమాలో మనోహరి సాంగ్‌తో మరోసారి తెలుగులో హాట్‌స్టార్‌గా మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ ఐటమ్‌ పాప వివాదంలో చిక్కుకుంది. ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ వేదికపై ప్రదర్శన చేసింది. ఇదే వేదికపై నోరా ఫతేహి భారతీయ జెండాను అగౌరవపరిచింది. అంటూ నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.

నోరా ఫతేహి భారత జెండాను ఫిఫా వేదికపై రెపరెపలాడించినందుకు నెటిజెన్లు నుంచి ప్రశంసలు అందుకుంది. కానీ ఆ తర్వాత, నోరా భారత జెండాను తలకిందులుగా పట్టుకున్నందుకు ఆమెను సోషల్ మీడియా వేదికా ట్రోల్ చేస్తున్నారు. నోరా భారత జెండాని అగౌరవపరిచింది అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి…

భారీ బడ్జెట్‌ సినిమాల…బుట్టబొమ్మ

HIT3 హీరో ఎవరంటే ?

సింగం ఇజ్‌ బ్యాక్‌…

- Advertisement -