Hyderabad:మెగా జాబ్ మేళా

40
- Advertisement -

హైదరాబాద్ కూకట్ పల్లి నియోజవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించిరు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ మెగా జాబ్ మేళాలో 100కు పైగా కంపెనీలు స్టాల్స్ ని ఏర్పాటు చేవారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్..కూకట్ పల్లి నియోజకవర్గం పైన నాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఈ జాబ్ మేళా ద్వారా కల్పించనున్నారని చెప్పారు.

ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు ఆధ్వర్యంలో ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తాం అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అందరం కలసి పోరాటం చేసినం అన్నారు. కూకట్ పల్లిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల వారి ఇబ్బంది పడుతుంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ప్రత్యేకంగా ట్రైన్ లు ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి వారి స్వస్థలాలుకు పంపినారన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రము మొదటి స్థానంలో ఉందని…హైదరాబాద్ నగరం మంత్రి కేటీఆర్ నాయకత్వం లో అనేక కంపెనీ లు వస్తన్నాయన్నారు.దేశాన్నికి అన్నము పెట్టె స్టాయకి తెలంగాణ రాష్ట్రము చేరుకుందని..దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపు చూస్తోందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎన్నో కార్పొరేట్ కంపెనీలు తెలంగాణ కు వచ్చాయన్నారు. దేశంలో ఎక్కడ లేని విదముగా మన దగ్గర 24గంటలు కరెంటు ఇస్తున్నా ప్రభుత్వం మనదన్నారు. ఈ జాబ్ మేళా ను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -