‘నాన్న కూచి’తో మెగా డాటర్….

244
- Advertisement -

మెగా ఫ్యామిలీలో ఇప్పటి వరకు హీరోలే వెండితెరపై సందడి చేస్తూ రాగా…ఇటీవలే నాగబాబు కూతురు నిహారిక బుల్లితెరపై టీవీషోస్‌ ద్వారా అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆతర్వాత ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమా తనకు అనుకునంత గుర్తింపు తీసుకరాలేకపోవడంతో తన తదుపరి సినిమాకు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తోంది మెగా డాటర్‌ నిహారికా.

Mega heroine becomes 'Nanna Kuchi'

ఇక ఇప్పుడు రెండో సినిమా మొదలుపెట్టేందుకు కాస్త సమయం తీసుకోనున్న ఆమె, ఈ గ్యాప్‌లో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సారి ఆమె చేస్తోన్న వెబ్ సిరీస్ పేరు ‘నాన్న కూచి’.ఈ వెబ్ సిరీస్ లో నిహారిక తండ్రిగా నాగబాబు నటిస్తుండటం విశేషం. రియల్ లైఫ్ లో మాదిరిగానే ఈ ఇద్దరూ తండ్రీ కూతుళ్ల పాత్రలను పోషిస్తుండటంతో ఈ వెబ్ సిరీస్ పై మరింత ఆసక్తి పెరిగింది. గతంలో నిహారికా వెబ్ సిరీస్ తో చేసిన ‘ముద్దపప్పు ఆవకాయ’మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ‘ముద్దపప్పు ఆవకాయ్‌’వెబ్‌ సిరీస్‌ తీసిన ప్రణీత్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

Mega heroine becomes 'Nanna Kuchi'

ఈ సినిమ షూటింగ్‌ నిన్న హైదరాబాద్‌లో మొదలైంది. ఈసందర్భంగా నిహారిక మాట్లాడుతూ – ‘‘నాన్నతో నటించడానికి భయపడలేదు. హీ ఈజ్‌ వెరీ కూల్‌. ఇంట్లో మేం ఎలా ఉంటామో.. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రల్లోనే నటిస్తున్నాం. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని నిహారికా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా… చాలామంది వెబ్‌ సిరీస్‌ అనుకున్నారు. కానీ, ఇది ఫీచర్‌ ఫిల్మ్‌’’అని నిహారికా క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాకి నిర్మాత కూడా తానే అని నిహారికే తెలిపారు. వెండితెరపై తొలి చిత్రం ‘ఒక మనసు’తర్వాత ఆమె నటిస్తున్న రెండో సిన్మా ‘నాన్న కూచి’.

Mega heroine becomes 'Nanna Kuchi'

ఇక నిహారికా సినిమాల విషయానికి వస్తే….అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చేయనున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈసినిమా సబ్జెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయట. ఈచిత్రం పెళ్ళిచూపులు హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించే ఛాన్స్‌ వుందని సమాచారం. అల్లుఅరవింద్‌ ఈ చిత్రాని నిర్మాతగా వ్యవహారిస్తారని ఫిల్మ్‌నగర్‌లో గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

- Advertisement -