సినిమా హీరోలకు సెంటిమెంట్స్ ఎక్కువనే చెప్పుకోవాలి. తమ కెరీర్ లో విజయాలు సాధించాలంటే కొంత మంది తమ పేర్లను మార్చుకుంటారు. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా అదే పని చేశాడు. సాయి ధరమ్ తేజ్ పేరు ఉంటే హిట్లు రావడం లేదని ఆయన కొత్త పేరు పెట్టుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ ను కాస్త సాయి తేజ్ గా మార్చుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలు సాధించిన తేజ్ ఇటివలే వరుసగా 5ప్లాప్ లతో కష్టాల్లో ఉన్నాడు. పేరు మారుస్తే విజయం వస్తుందన్న నమ్మకంతో ఆయన ఇలా మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఇక తేజ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వం లో చిత్రలహరి అనే సినిమా చేస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్, నివేధా హేతురాజ్ లు ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు నిర్మిస్తున్న ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రాన్ని ఏప్రిల్ 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ను ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. నిన్న ఈమూవీలోని పరుగు పరుగు అనే పాటను కూడా విడుదల చేశారు. దేవి శ్రీ ప్రసాద్ రాసిన ఈపాట ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈపాటలో సాయి ధరమ్ తేజ్ పేరుకు బదులుగా సాయి తేజ్ అని టైటిల్స్ లో రాశారు. అయితే ఇంతకాలం తనకు పెద్దగా కలిసిరాని స్క్రీన్ నేమ్‌ను సాయి తేజ్‌గా మార్చేశారు. కొత్త పేరుతోనైనా తేజ్ కి హిట్ వస్తుందో లేదో చూడాలి మరి.