ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్న మెగా హీరో…

395
ntr, sai dharam tej
- Advertisement -

సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇటివ‌లే న‌టించి విడుద‌లైన సినిమా తేజ్ ఐ ల‌వ్ యూ. ఈసినిమాకు ప్రేమ‌క‌థ‌ల స్పెష‌లిస్ట్ క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈసినిమాకు ప్రేక్ష‌కుల నుంచి అనుకున్నంత స్పంద‌న రాలేదు. సినిమా పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో మ‌రో ప్లాప్ ను మూట‌క‌ట్టుకున్నాడు తేజ్. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల‌నుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్, డైరెక్ట‌ర్ కరుణాక‌ర‌ణ్ కు నిరాశే ఎదురైంది.

sai dharam tej

సినిమాలో క‌థ రోటిన్ గా ఉండ‌టంతో అంత‌పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇక సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న త‌రువాతి సినిమాపై తీవ్ర క‌స‌రత్తు చేస్తున్నాడు. క‌థ ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నాడు. సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌థ‌లు ఎంపిక చేసుకోవ‌డంలో చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. కెరీర్ మొదట్లో బాగానే హిట్లు వ‌చ్చినా ఆ తర్వాత వ‌చ్చిన ఆరు సినిమాలు ప్లాప్ కావ‌డంతో డైల‌మాలో ఉన్నాడు తేజ్.

Sai-Dharam-Tej

తేజ్ త‌న త‌ర్వాతి సినిమాలో కొత్త లుక్ లో క‌నిపించ‌డానికి అమెరికాకు వెళ్లాడు. అత‌ని పాత సినిమాల‌తో పొల్చుకుంటే తేజ్ కాస్త లావ‌య్యాడు. దింతో అత‌ను బాడీ ఫిట్ నెస్ పై కూడా దృష్టి పెట్టాడు. తేజ్ కొత్త లుక్ లో క‌న‌పించ‌డానికి మ‌రికొన్ని రోజులు అమెరికాలోనే ఉండ‌నున్నాడ‌ని స‌మాచారం. అమెరికాలో ఎన్టీఆర్ ఫిట్ నెస్ కోసం శిక్ష‌ణ తీసుకున్న ట్రైన‌ర్ ద‌గ్గ‌రే తేజ్ కూడా శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ని స‌మాచారం. జైల‌వ కుశ సినిమాకు ముందు ఎన్టీఆర్ కూడా అమెరికా వెళ్లి బాడీ ఫిట్ నెస్ పై శిక్ష‌ణ తీసుకున్నాడు. ఇక తేజ్ త‌రువాతి చిత్రం చిత్ర‌ల‌హ‌రి. ఈసినిమ‌కు కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

- Advertisement -