అక్టోబర్‌లో #RRR మూవీ..!

255
- Advertisement -

జక్కన్న చెక్కిన బాహుబ‌లి చిత్రం త‌ర్వాత మ‌ళ్ళీ అభిమానులు అంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి రాజమౌళి..రామారావు..రామ్‌చరణ్‌ ఆంగ్ల పేర్లలో మొదటి అక్షరం ‘R’ వచ్చేలా #RRR అనే పేరుతో ఈ మూవీకి ప్ర‌చారం జ‌రుగుతుంది.

RRR Movie

అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అనే ఆసక్తితో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. ఇటు చరణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు అభిమానుల‌లో ఆనందాన్ని క‌లుగ జేస్తున్నాయి. ఇటీవల న‌వంబ‌ర్ నెల‌లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. మొద‌ట ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ల‌పై సోల్ సీన్స్ తెర‌కెక్కించి, ఆ త‌రువాత ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో సీన్స్ షూట్ చేస్తార‌ని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం భారీ సెట్టింగ్స్‌ను నిర్మిస్తున్నారట‌.

ఇక తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబర్‌లో మొదలుపెట్టనున్నారట. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంఫై దానయ్య డివివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌ల ఎంపిక జరగాల్సివుంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ అర‌వింద స‌మేత మూవీతో బిజీగా ఉండగా.. రామ్ చ‌ర‌ణ్ బోయ‌పాటి సినిమా చేస్తున్నాడు. 2020లో విడుద‌ల కానున్న రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్ సినిమాకి కీరవాణి సంగీతం అందించ‌నున్నారు.

- Advertisement -