శోభాడేని ట్రోల్ చేస్తోన్న మెగా ఫ్యాన్స్

258
shoba day
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు ప్రముఖ కాలమిస్ట్ శోభా డే. సామాజిక అంశాలపై చురుగ్గా స్పందించే శోభా డే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదానికి దారితీసింది.

ఆదివారం కన్నడ నటుడు చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించారు. అయితే శోభా డే పొరపాటున చనిపోయింది మెగాస్టార్ చిరంజీవి అనుకుని సినీ ఇండస్ట్రీ మరోస్టార్‌ని కొల్పోయిందని చిరు ఫోటోను షేర్ చేస్తూ కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.

ఈ పోస్టు కొద్దిక్షణాల్లో వైరల్ కావడం, మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురికావడంతో తన తప్పును తెలుసుకున్న శోభా డే ఆ పోస్టును వెంటనే డిలీట్ చేశారు. అయితే అప్పటికే శోభా పోస్టును సేవ్ చేసుకున్న ఫ్యాన్స్…ఆమెను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

పేరు చిరంజీవి అయినంత మాత్రాన వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదా అంటూ మండిపడుతున్నారు. శోభా తాను చేసిన పోస్టును డిలీట్ చేసినా ట్రోల్ మాత్రం ఆగడంలేదు.

- Advertisement -