మెగా అభిమాని అదిరిపోయే గిఫ్ట్‌….

179
- Advertisement -

హీరో రాంచరణ్‌కు ఓ అభిమాని అరుదైన గిప్ట్‌ను ఇచ్చాడు. ఆయన నిర్మాతగా తెరగేట్రం చేసిన ఖైదీనెంబర్‌150 సినిమా టైటిల్‌ లోగోను ఐస్‌తో తయారు చేసిచ్చాడు. ఈవిషయాన్ని స్వయంగా రాం చరణ్‌ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు….ఓ లవ్లీ అభిమాని ఈ ఐస్‌ శిల్పాన్ని తయారు చేసిచ్చాడని…ఖైదీనెంబర్‌ 150 సినిమా విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నామంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు రాంచరణ్‌.

Mega Fans Gift Khaidi No 150

మెగాస్టార్‌ నటించిన ఖైదీ మూవీ ఈనెల11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ దగ్గర నుంచి మొదలుకొని రిలీజ్‌ వరకు ఈ సినిమా ఫుల్‌ పాపులారీటి సంపాదించుకుంది. తొమ్మిది సంవత్సరాల గ్యాప్‌ తర్వాత చిరు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడంతో మెగాస్టార్‌ అభిమానులు సినిమాని ఎగబడి చూశారు. ఖైదీ సినిమాలో చిరు అద్భుతంగా నటించాడని సుదీర్ఘకాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఏ మాత్రం మార్పు లేకుండా అదే స్థాయిలో ప్రేక్షకులను మెప్పించడాని పలువురు మెగా అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. రిలీజైన నాటి నుంచి నేటి వరకు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సినిమాపై జాతీయ మీడియాకూడా ప్రచారం చేయడం విశేషం.

Mega Fans Gift Khaidi No 150

సినిమా రిలీజ్‌ తర్వాత పలువురు దర్శకులు, నటీనటులు చిరు నటనను అభినందించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గతంలో చిరుతో పలు సినిమాలు చేసిన అలనాటి నటి సుహాసిని చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్‌ చేశారు. ‘నా స్నేహితుడు, సహ నటుడికి శుభాకాంక్షలు.. సంతోషంగా, గర్వంగా ఉంది’ అంటూ చిరుతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు.

- Advertisement -