ఖైదీని మెచ్చిన వర్మ..150 మిలియన్ చీర్స్‌

100
varma

మెగాబ్రదర్ నాగబాబుతో వివాదం చేలరేగిన తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్‌.150 మూవీపై సంచలన కామెంట్లు చేసిన రామ్ గోపాల్ వర్మ..ఈసారి కాస్త డిఫరెంట్‌గా స్పందించాడు. చిరంజీవి ఖైదీ నెంబర్.150 సినిమా చూశానని..ఖైదీ మెగా మెగా మెగా ఫంటాస్టిక్ అని అన్నాడు. చిరుకు 150 మిలియన్ చీర్స్ అని విషెస్ చెప్పాడు. మెగాస్టార్ ఎనర్జీ లెవల్స్ ఇప్పటికీ ఓ రేంజ్ లో ఉన్నాయని వర్మ కితాబిచ్చాడు. తొమ్మిదేళ్ల కిందట సినిమాలకు దూరంగా వెళ్లినప్పుడు చిరు ఎలా ఉన్నారో.. ఇప్పుడు ఖైదీ మూవీలో అంతకంటే చాలా యంగ్ గా కనిపిస్తున్నారని రాసుకొచ్చాడు.

వర్మ ఏం చేసినా తన మార్క్ ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు. బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగోడి చరిత్రను తెలిపే గొప్ప మూవీ అని ప్రశంసించిన రాంగోపాల్ వర్మ.. చిరు మాత్రం అరువు తెచ్చుకున్న కథతో సినిమా చేశాడని తీవ్రంగా విమర్శించాడు. ఇప్పుడేమో ఖైదీ సినిమాకు చిరంజీవికి విషెస్ అంటూ పోస్ట్ చేయడంతో వర్మ ఏంటో ఎవరికి అర్ధంకాడు అంటూ మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా తలలు గోక్కుంటున్నారు. ఏదేమైనా వర్మ ట్విట్‌తో మెగా వర్సెస్‌ వర్మ వివాదానికి పుల్ స్టాప్ పడ్డట్టే కనబడుతోంది. మరి దీనిపై మెగా హీరోలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.