మెగా ఇంటర్వ్యూ..చిరు కామెంట్స్!

25
- Advertisement -

ఎదుటి వాళ్లకు సాయం చేయాలన్న గుణం తమకు తమ తల్లిదండ్రుల నుండే వచ్చిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి తల్లి అంజనమ్మతో చిరంజీవి, నాగబాబు, మాధవి, విజయ దుర్గ.. లతో మెగా వుమెన్ అని ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఒకరికి సపోర్ట్ గా ఉండటం, సాయం చేయడం మా అమ్మ నాన్న దగ్గర్నుంచి వచ్చింది. అమ్మ వాళ్ళ నాన్న 40+ ఏజ్ లోనే చనిపోయారు. తనకి ఓ తమ్ముడు, చెల్లెల్లు ఉన్నారు అన్నారు. అప్పుడు నాన్నే అమ్మ వాళ్ళ చెల్లెళ్లను చూసాడు. వాళ్లందరికీ సపోర్ట్ ఉన్నాడు అని చెప్పారు.

అమ్మ కూడా మా పెదనాన్న చనిపోతే వాళ్ళ పిల్లలకు చాలా సపోర్ట్ గా నిలిచింది. వాళ్ళ పెళ్లిళ్లు, పేరంటాలు అమ్మే చేసింది. వాళ్లకు ఇల్లు కొనిపెట్టింది. కొన్నాళ్ల పాటు కొంత డబ్బులు నెల నెలా కూడా వాళ్లకు పంపించింది అమ్మ. వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయ్యే వరకు అమ్మ ఎంతగానో సపోర్ట్ చేసింది. బంధాలు, బంధుత్వాలు ఎనలేని ఆస్తిపాస్తులు. డబ్బులు కూడా ఉండాలి. డబ్బులు ఉన్నా అందరితో ఉండాలి. కష్టం వచ్చినప్పుడు మనిషికి మనిషే తోడు ఉండాలి అని అన్నారు. దీంతో ఎప్పుడూ నెటిజన్లు ఇప్పుడు మెగా పేరెంట్స్ ని కూడా అభినందిస్తున్నారు అన్నారు.

Also Read:ప్రభుత్వంకు నీటి ప్రణాళిక లేదు: జగదీష్ రెడ్డి

- Advertisement -