తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. మొత్తం ఐదు స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంగా కాంగ్రెస్‌కు మూడు, బీఆర్ఎస్‌కు 1, సీపీఐకి 1 దక్కనున్నాయి. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గా… పార్టీ సీనియర్ నేత..డా. దాసోజు శ్రవణ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ని ఆదేశించారు. కాగా కేసీఆర్ ఆదేశాలమేరకు ఇవాళ దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
పొత్తులో భాగంగా సీపీఐకి ఒక ఎమ్మెల్సీ సీటును ఇచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ అభ్యర్థులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, పార్టీ సీనియర్ లీడర్ విజయశాంతి పేర్లను ప్రకటించింది.
అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేశారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఈనెల 20న ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేరోజు కౌంటింగ్ ఉండనుండగా అభ్యర్థుల గెలుపు లాంఛనమేకానుంది. ఇక సీపీఐ నుండి మునుగోడుకు చెందిన నెల్లికంటి సత్యంను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసింది పార్టీ.
Also Read:మెగా ఇంటర్వ్యూ..చిరు కామెంట్స్!

