మహేశ్ బాబు ధియేటర్లో మెగా ఫ్యామిలీ సందడి

585
mega-gang
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏఎంబీ మాల్ లో మెగా ఫ్యామిలీ సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత పుట్టిన రోజు సందర్భంగా ఏఎంబీ మాల్‌లో బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో అల్లు అర్జున్ ఆయ‌న భార్య స్నేహా రెడ్డి, అల్లు శిరీష్‌, వ‌రుణ్ తేజ్, సాయిధ‌ర‌మ్ తేజ్,బ‌న్నీ సోద‌రుడు అల్లు బాబి, మెగా హీరోయిన్ నిహారికి, చిరు కుమార్తెలు శ్రీజ‌, సుస్మిత‌, చిరు చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్‌తో పాటు ప‌లువురు కుటుంబ స‌భ్యులు ఈ గ్యాంగ్‌లో ఉన్నారు.

వీరందరి ఒక చోట ఉండగా రామ్ చరణ్ , ఉపాసన ఈ ఫోటో లో లేకపోవడంతో మెగా అభిమానులు నిరుత్సహ పడుతున్నారు. అయితే చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో షూటింగ్ బీజీగా ఉండటంతో తన అక్క బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నాడు. ఈ ఫోటో చూసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -